కాంగ్రెస్‌ ‘భారత్‌ జోడో యాత్ర’ను ప్రారంభించిన రాహుల్ గాంధీ.. హాజరైన తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు

Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra CMs of Tamil Nadu Rajasthan and Chhattisgarh Attends, Rahul Gandhi launches Bharat Jodo Yatra, Bharat Jodo Yatra, Congress Bharat Jodo Yatra , Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Bharat Jodo Yatra, Mango News, Mango News Telugu, Tamil Nadu Rajasthan and Chhattisgarh CM Attended, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi , Rajiv Gandhi, Priyanka Gandhi, Sonia Gandhi, Rahul Gandhi Latest News And Updates

తమిళనాడులోని కన్యాకుమారిలో ‘భారత్ జోడో’ యాత్రను అధికారికంగా ప్రారంభించారు కాంగ్రెస్‌ ఆహార నేత, ఎంపీ రాహుల్ గాంధీ. బుధవారం సాయంత్రం జాతీయ ప‌తాకం చేతపట్టి ఆయన గాంధీ మంట‌పం నుంచి తొలి అడుగు వేశారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వీరిలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ ఉన్నారు. వీరితో పాటు పార్టీ సీనియర్ నేతలు పి చిదంబరం, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా 150 రోజుల పాటు చేయనున్న ఈ యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 150 రోజుల్లో 3,570 కిలోమీటర్లు సాగనుంది.

ఇక యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్‌ గాంధీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్‌ను సందర్శించుకున్నారు. ఈ క్రమంలో రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామివివేకానంద చిత్రపటాలకు నమస్కరించారు. యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమానికి హాజరైన వేలాదిమంది కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేడు కాంగ్రెస్ మాత్రమే కాదు, లక్షలాది మంది ‘భారత్ జోడో’ యాత్ర ఆవశ్యకతను గుర్తిస్తున్నారని, దేశవ్యాప్తంగా ఈ యాత్ర అవసరమని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. భారతదేశం లోని అన్ని వర్గాల వారికి న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, మరలా పార్టీని అధికారంలోకి తేవడంలో భాగంగా ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ యాత్ర ద్వారా దేశంలోని సామాన్యుల కష్టాలను తెలుసుకుంటామని, వారి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =