ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ బ్రజ్ బసి లాల్ శనివారం ఉదయం కన్నుమూశారు. హరప్పా నాగరికత, మహాభారతానికి సంబంధించిన పురావస్తు ప్రదేశాలపై బీబీ లాల్ విస్తృత పరిశోధనలు చేశారు. బీబీ లాల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు. 1970లలో రామజన్మభూమి స్థలంలో తవ్వకాలకు ఆయన నాయకత్వం వహించారు. బీబీ లాల్ సేవలకు గుర్తింపుగా 2021లో కేంద్రప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
బీబీ లాల్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. ““శ్రీ బీబీ లాల్ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. సంస్కృతి మరియు పురావస్తు శాస్త్రానికి ఆయన చేసిన కృషి అసమానమైనది. మన సుసంపన్నమైన గతంతో మన అనుబంధాన్ని మరింతగా పెంచిన గొప్ప మేధావిగా ఆయన గుర్తుండిపోతారు. ఆయన మృతితో బాధపడ్డాను నా ఆలోచనలు అతని కుటుంబం మరియు స్నేహితులతో ఉన్నాయి. ఓం శాంతి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY