స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో తెలంగాణలోని 16 పట్టణ స్థానిక సంస్థలకు అవార్డులు, దేశానికే ఆదర్శమన్న సీఎం కేసీఆర్

CM KCR Expressed Happiness over Telangana Municipalities Won 16 Awards in Swachh Survekshan 2022, Swachh Sarvekshan 2022, 16 Awards To Urban Local Organizations In Telangana, CM KCR Said Telangana Is Role Model For The Country, CM KCR on Swachh Sarvekshan Awards, Swachh Sarvekshan Awards, Swachh Sarvekshan, Mango News, Mango News Telugu, Swachh Survekshan, Swachh Survekshan 2022, Telangana Swachh Survekshan, Swachh Survekshan Latest News And Updates, Telangana News And Live Updates, Swachh Survekshan Telangana

స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలు అవార్డులు గెలుచుకోవడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కోసం చేస్తున్న కృషికి దర్పణంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రం పలు విభాగాల్లో 13 అవార్డులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.

పట్టణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పురపాలక చట్టంతో పాటు, విడతల వారీగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయని సీఎం అన్నారు. పట్టణాల్లో మౌలికవసతుల కల్పన, పారిశుద్ధ్యం, పట్టణ హరిత వనాల ఏర్పాటు, గ్రీన్ కవర్ ను పెంచడం, నర్సరీల ఏర్పాటు, ఓడిఎఫ్ ల దిశగా కృషితో పాటు పలు అభివృద్ధి చర్యలు చేపట్టడం ద్వారా గుణాత్మక ప్రగతి సాధ్యమైందని సీఎం తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేసిన, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను, ఆ శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, భాగస్వాములైన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులకు సీఎం అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆశయాల సాధన దిశగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇదే స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY