ఫిల్మ్ నగర్ క్లబ్ అధ్యక్షుడిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఎన్నిక

Ghattamaneni Adiseshagiri Rao Elected As President of Film Nagar Club, Ghattamaneni Adiseshagiri Rao , President of Film Nagar Club, Film Nagar Club President, Adiseshagiri Rao , Ghattamaneni Adiseshagiri Rao President of Film Nagar Club, Mango News, Mango News Telugu, Film Nagar Club Latest News And Updates, Film Nagar Cultural Center, Film Nagar Club Elections, FNCC, Ghattamaneni Adiseshagiri Rao New Film Nagar Club President

హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్‌సీసీ) ఎన్నికలు సెప్టెంబర్ 25, ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఫిల్మ్ నగర్ క్లబ్ అధ్యక్షుడిగా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, పద్మాలయ స్టూడియోస్ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ నిర్వహించగా, అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి రాత్రికి గెలుపొందిన వారి పేర్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చౌదరి ప్రకటించారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, సురేష్ బాబు మద్దతుతో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్యానల్ బరిలోకి దిగి విజయం సాధించింది. 324 ఓట్ల ఆధిక్యంతో ఆదిశేషగిరిరావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆదిశేషగిరిరావు విజయంపై ఫిల్మ్ నగర్ ప్రముఖులు, కృష్ణ, మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు.

ఇక హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఆదిశేషగిరిరావు ప్యానెల్ నుంచి ఉపాధ్యక్షుడిగా తుమ్మల రంగారావు గెలుపొందారు. అయితే ఉపాధ్యక్షుడి పదవి కోసం బరిలోకి నిలిచిన ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఓడిపోయారు. అదేవిధంగా ఎఫ్ఎన్‌సీసీ సెక్రటరీగా ముళ్ళపూడి మోహన్, జాయింట్‌ సెక్రెటరీగా వీవీఎస్ఎస్ పెద్దిరాజు, కోశాధికారిగా రాజశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎఫ్ఎన్‌సీసీ కమిటీ సభ్యులుగా శైలజ జూజాల, ఏడిద రాజా, సీహెచ్‌ వరప్రసాదరావు, కాజా సూర్యనారాయణ, డైరెక్టర్ మురళీమోహన్‌రావు, ఇంద్రపాల్ రెడ్డి, వడ్లపట్ల మోహన్, బాలరాజు, గోపాలరావు ఎన్నికయ్యారు. కాగా ఎఫ్ఎన్‌సీసీలో రెండేళ్లకోసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here