దేశంలో కొత్తగా 2,529 మందికి కరోనా పాజిటివ్, ఏ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువంటే?

India Reports 2529 New Corona Positive Cases, 12 Deaths in Last 24 Hours

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 1,22,057 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,529 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 2.07 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,04,463 కు చేరుకుంది. కొత్తగా మరో 12 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,745 కి పెరిగింది. అలాగే మరో 3,553 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,40,43,436 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 32,282 (0.07%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (అక్టోబర్ 5 (8am)–అక్టోబర్ 6 (8am)):

  1. కేరళ – 870
  2. తమిళనాడు – 421
  3. మహారాష్ట్ర – 416
  4. ఢిల్లీ – 96
  5. పశ్చిమబెంగాల్ – 92
  6. గుజరాత్ – 85
  7. కర్ణాటక – 76
  8. ఒడిశా – 68
  9. తెలంగాణ – 61
  10. పుదుచ్చేరి – 43.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY