చిన్నారుల వ్యాక్సినేషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.. ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ

PM Narendra Modi Holds Review Meeting with Chief Ministers Amid Rising Covid-19 Cases, PM Narendra Modi Holds Review Meeting with All States CMs, Review Meeting with All States CMs, India Covid-19, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, India Coronavirus, India Coronavirus Cases, India Coronavirus Deaths, India Coronavirus New Cases, India Coronavirus News, India New Positive Cases, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Mango News, Mango News Telugu,

దేశంలో గత రెండు వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. చిన్నారుల వ్యాక్సినేషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారికి సంబంధించిన ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, కావున అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అర్హులైన పిల్లలందరికీ త్వరితగతిన టీకాలు వేయించడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, దీనిపై పిల్లల్లో మరియు తలిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైరస్‌కు వ్యతిరేకంగా దేశంలో టీకాలు వేసే డ్రైవ్ గురించి ప్రధాని మోదీ తెలిపారు.

దేశంలోని 96 శాతం వయోజన జనాభా కనీసం ఒక డోస్ కోవిడ్ వ్యాక్సిన్‌ను పొందడం ప్రతి భారతీయుడికి గర్వకారణం అని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం మరియు రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాల వల్ల వైద్య కళాశాలలు మరియు జిల్లా ఆసుపత్రులలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయని వెల్లడించారు. మనదేశంలో రాష్ట్రాల్లో ఇప్పుడు మళ్ళీ కేసుల పెరుగుదలను మనం చూడవచ్చు. మనం అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ ఛాలెంజ్‌ను ఇంకా అధిగమించలేదని స్పష్టమైందని సిఎంలతో స్పష్టం చేశారు. మన శాస్త్రవేత్తలు మరియు నిపుణులు జాతీయ మరియు ప్రపంచ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మేము వారి సూచనలను ఆచరిస్తున్నామని తెలిపారు. అలాగే ముందు ముందు రానున్న పండుగల సమయంలో కరోనా వైరస్ ముప్పు గురించి అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సిఎంలకు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =