ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రశంసించడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ఆయన రాజస్థాన్‌లో అదానీ భారీ పెట్టుబడులకు గెహ్లాట్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ఒక రోజు తర్వాత దీనిపై మాట్లాడారు. శనివారం ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ అంశంపై విలేఖరుల ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానమిస్తూ.. తాను కార్పొరేట్లకు వ్యతిరేకం కాదని, కేవలం గుత్తాధిపత్యానికి మాత్రమే వ్యతిరేకం అని పేర్కొన్నారు. అదానీ రాజస్థాన్‌లో రూ.60,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని, దీనిని తిరస్కరించడం ఏ ముఖ్యమంత్రికైనా సాధ్యం కాని పని అని రాహుల్ వ్యాఖ్యానించారు.
రాజస్థాన్‌లో అదానీ గ్రూప్‌కు అయాచితంగా మేలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయపరమైన అధికారాన్ని ఉపయోగించలేదని, ఒకవేళ గెహ్లాట్ ప్రభుత్వం అదానీకి తాయిలాలు అందించినట్లైతే, అప్పుడు దానిని తప్పకుండా వ్యతిరేకిస్తానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం కేవలం బడా వ్యాపారవేత్తలకు మాత్రమే సాయం చేస్తోందని, దీనిలో భాగంగా గౌతమ్ అదానీ వంటి వారికి అనేక రకాలుగా మేలు చేస్తోందని రాహుల్ తరచూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా గౌతమ్ అదానీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతుండగా, మరికొన్ని రోజుల్లో ఇది తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అవనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY