మునుగోడులో ధన బలానికి, ప్రజల జన బలానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది: కేటీఆర్

TRS Party Working President KTR held Teleconference with Party Leaders Workers who Went for Campaign in Munugode, TRS Party Working President KTR, Teleconference TRS Party Leaders, TRS Campaign in Munugode, Mango News, Mango News Telugu, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

మునుగోడు ఉపఎన్నికలో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తరుపున మునుగోడులో ప్రచారానికి వెళ్లిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. మునుగోడులో జరగబోయే ఉప ఎన్నిక మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మరియు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్నదన్నారు. వేలకోట్ల రూపాయల అక్రమ కాంట్రాక్టులతో సంపాదించిన ధనబలంతో జనాలను పట్టించుకోకుండా ఇన్నాళ్లుగా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఈరోజు ఉప ఎన్నికలు తీసుకొచ్చారని కేటీఆర్ విమర్శించారు. కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలంకి మునుగోడు ప్రజల జన బలంకి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని కేటీఆర్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి ధన దాహం, వేల కోట్ల రూపాయల ఆయన కాంట్రాక్టుల కోసమే వచ్చిన ఎన్నిక ఇదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరారు.

ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఆయన ఒక అట్టర్ ప్లాఫ్ ఎమ్మెల్యే అని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గ అభివృద్దిని, ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తన కాంట్రాక్టుల గురించి మాత్రమే ఆలోచించే ఫక్తు రాజకీయ వ్యాపారి రాజగోపాల్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. నియోజకవర్గ సమస్యలను వదిలేసి అసెంబ్లీలో కాంట్రాక్టర్ల బిల్లుల కోసం మాట్లాడిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి ధన దాహంతోనే ఈ ఉప ఎన్నిక మునుగోడు ప్రజల మీద బలవంతంగా రుద్దబడిందన్నారు.

కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్కదాన్ని నెరవేర్చకుండా చేతులెత్తేసిన రాజగోపాల్ రెడ్డి, ఈ ఉప ఎన్నిక సందర్భంగా మరోసారి ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఇచ్చిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కమీషన్ పైసలతో బైకులు, కార్లుతో పాటు ఇతర విలువైన వస్తువులను ఓటర్లకు రాజగోపాల్ రెడ్డి పంచుతున్నారు. ఇంకో సంవత్సరం పాటు పదవి కాలం ఉన్నా, ఉపఎన్నిక స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నిక తెచ్చారని, అయితే చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు బీజేపీకి, రాజగోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒకవైపు బీజేపీ రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు వ్యవహారాన్ని, ఆయన విఫలం అయిన విధానాన్ని ప్రజలకు వివరిస్తూనే. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ గత ఎనిమిది సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి చేసిన కార్యక్రమాలను వివరించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY