తెలంగాణలో నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్
జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 14తో నామినేషన్స్ దాఖలు పక్రియ కూడా ముగియడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారపర్వంపై దృష్టి సారించాయి. అందులో భాగంగా మునుగోడు ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ 38 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను గురువారం నాడు విడుదల చేసింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో నిలిచారు. మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుని సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో మునుగోడులో ప్రచారంలో పాల్గొనే 38 మందితో కూడిన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు.
మునుగోడు ఉపఎన్నిక కోసం 38 మంది కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా:
- మాణికం ఠాగూర్
- ఎ.రేవంత్ రెడ్డి
- భట్టి విక్రమార్క మల్లు
- రోహిత్ చౌదరి
- ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
- చల్లా వంశీ చంద్ రెడ్డి
- వి.హనుమంత రావు
- కె.జానా రెడ్డి
- మహ్మద్ అలీ షబ్బీర్
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- మధు యాస్కీ గౌడ్
- దామోదర్ సి.రాజనర్సింహ
- డి.శ్రీధర్ బాబు
- పొన్నం ప్రభాకర్
- టి.జీవన్ రెడ్డి
- రేణుకా చౌదరి
- పోరిక బలరాం నాయక్
- కొండా సురేఖ
- డి.అనసూయ(సీతక్క)
- డాక్టర్ జె.గీతారెడ్డి
- ఎం.అంజన్ కుమార్ యాదవ్
- ఎస్.ఎ.సంపత్ కుమార్
- టి.శంకర్ నాయక్
- ప్రేమ్ సాగర్ రావు
- కుంభం అనిల్ కుమార్ రెడ్డి
- ఎన్.రాజేందర్ రెడ్డి
- వేం నరేందర్ రెడ్డి
- చెరుకు సుధాకర్
- జి.విజయ రమణారావు
- గండ్ర సత్యనారాయణరావు
- డా.చిక్కుడు వంశీకృష్ణ
- ఎస్.రాములు నాయక్
- జయ ప్రకాష్ రాపోలు
- పున్న కైలాష్ నేత
- చలమల కృష్ణా రెడ్డి
- పల్లె రవి
- ఆది శ్రీనివాస్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY