టీఆర్ఎస్ ప్రభత్వ పథకాలను కేంద్రంలోని బీజేపీ పేర్లు మార్చి అమలు చేస్తోంది – మంత్రి హ‌రీశ్ రావు

Telangana Minister Harish Rao Visits Newly Formed Dongli Mandal in Kamareddy District Today, Harish Rao Visits Newly Formed Dongli Mandal in Kamareddy District Today, Newly Formed Dongli Mandal in Kamareddy District, Telangana Minister Harish Rao, Kamareddy Dongli Mandal, Telangana Minister Harish Rao, Telangana Health Minister Harish Rao, Minister Harish Rao Public Meeting at Dongli, Harish Rao Public Meeting, Dongli Mandal News, Dongli Mandal Latest News, Dongli Mandal Live Updates, Mango News, Mango News Telugu

టీఆర్ఎస్ ప్రభత్వ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేర్లు మార్చి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తోందని పేర్కొన్నారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన డోంగ్లి మండలాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. డోంగ్లి మండలం కావాలని ఎప్పటినుంచో ఇక్కడి ప్రజలు కోరుతున్నారని, వారి ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ డోంగ్లిని మండలం చేశారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు 466 మండలాలు ఉండేవని, సీఎం కేసీఆర్ వాటిని 612 చేశారని అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రవ్యాప్తంగా త్రాగునీటికి మరియు సాగునీటికి అవస్థలు పడేవారమని, అయితే రాష్ట్రం సాధించుకున్నాక టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి బాధలు తొలగిపోయాయని మంత్రి తెలిపారు.

దీనికోసం సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషి చేశారని, మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో పాటు పలుచోట్ల చిన్న చిన్న చెక్ డ్యామ్స్ నిర్మించారని హ‌రీశ్ రావు గుర్తు చేశారు. ఇక భూ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను తెచ్చిందని, దీనివలన అవినీతి తగ్గిందని, రైతులకు పట్టా పాస్ పుస్తకాలు నేరుగా ఇంటికి వస్తున్నాయని మంత్రి వెల్లడించాహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మహబూబ్ నగర్ జిల్లా ఘటనలపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రు. ఇక మన రాష్ట్రంలో అమలవుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాపీ కొడుతోందని, మిషన్ భగీరథను ‘హర్ ఘ‌ర్ కో జల్’ అని, మిషన్ కాకతీయను ‘అమృత్ సరోవర్’ అని, రైతు బంధును ‘కిసాన్ సమ్మన్ యోజన’ అని పేర్లు మార్చి దేశంలో అమలు చేస్తున్నారని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here