ఆంధ్ర-తెలంగాణ మధ్య కృష్ణా నదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Centre Gives Green Signal To Iconic Cable Bridge Over The Krishna River Between AP and Telangana, Centre Approves Iconic Bridge On Krishna River, Centre Approves Cable Bridge On Krishna River, Cable Bridge on Krishna River Between AP and Telangana, Mango News, Mango News Telugu, Centre Approves Cable-Stayed Cum Suspension Bridge, Cable Bridge Across Krishna, 2-Storey Cable Bridge Across Krishna, New Bridge On River Krishna At Vijayawada, Iconic Bridge Amaravati, Krishna River Bridge Latest News And Live Updates

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఈ వంతెనను నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. దీనిని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ప్రగతి కా హైవే’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో గడ్కరీ ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. అయితే ఈ భారీ బ్రిడ్జిని కేవలం 30 నెలల్లోనే పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా గడ్కరీ తెలిపారు. కాగా భారతదేశంలోనే మొట్టమొదటి ఐకానిక్‌ కేబుల్‌ కమ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జిగా ఇది నిలవనుందని కేంద్రమంత్రి వెల్లడించారు.

ఇక దీనిని తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా.. ఆంధ్రాలోని కర్నూలు జిల్లాల మధ్యనున్న సోమశిల వద్ద నిర్మించనున్నట్లు కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటించారు. అలాగే ఇలాంటి బ్రిడ్జి ప్రపంచంలో రెండోది.. దేశంలో మొదటిదని ఆయన తెలిపారు. కాగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం దాదాపు 80 కిలోమీటర్లు తగ్గుతుందని చెప్పారు. ఇంకా ఈ బ్రిడ్జికి ఆంధ్రా వైపు సంగమేశ్వర స్వామి ఆలయం, తెలంగాణ వైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం ఉంటాయని, దీనిపై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్‌ వాక్‌వే కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బ్రిడ్జికి చుట్టూ ప్రత్యేకమైన లైటింగ్, కనుచూపు మేరలో శ్రీశైలం రిజర్వాయర్, నల్లమల అడవులు, ప్రకృతి రమణీయత పర్యాటకులను ఆకర్షిస్తాయని నితిన్‌ గడ్కరీ తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 17 =