ఖమ్మం-విజయవాడ ఎన్‌హెచ్‌-163జీపై 4-లేన్ యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, రూ.983 కోట్లు మంజూరు: నితిన్ గడ్కరీ

4 Lane Access Controlled Greenfield Highway on NH 163 G Khammam-Vijayawada Rs 983 Cr Sanctioned - Nitin Gadkari,4 Lane Access Controlled Greenfield Highway,NH 163 G Khammam-Vijayawada,Greenfield Highway on NH 163,Nitin Gadkari on Rs 983 Cr Highway Sanction,Mango News,Mango News Telugu,9 Bidders for Khammam,Khammam-Vijayawada Highway Sanctioned,Greenfield Highway Latest News,Construction of 4 Lane AC GH section,Nitin Gadkari Greenfield Highway News,Nitin Gadkari Latest Updates,Nitin Gadkari Live News

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎకనామిక్ కారిడార్ (ఎన్‌హెచ్‌-ఓ) కార్యక్రమం కింద వి.వెంకటాయపాలెం గ్రామం నుండి బ్రాహ్మణపల్లి(కే) గ్రామం వరకు ఎన్‌హెచ్‌-163జీ (ఖమ్మం-విజయవాడ)లో 4-లేన్ యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సెక్షన్‌ను అభివృద్ధి చేస్తున్నామని నితిన్ గడ్కరీ ప్రకటించారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో ఈ 29.92 కిమీ (ప్యాకేజీ-I) లేఅవుట్ నిర్మాణానికి రూ.983.90 కోట్లు మంజూరు చేయబడ్డాయని తెలిపారు. ఈ మేరకు నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.

ఈ ప్రాజెక్ట్ వాహన నిర్వహణ ఖర్చులు మరియు ప్రయాణ సమయాన్ని తగ్గించడం ద్వారా గణనీయమైన లాభాలను అందించనుందని, తద్వారా పరిసర ప్రాంతాలలో ఆర్థికాభివృద్ధిని సులభతరం చేస్తుందన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరడం, అంతిమంగా పరోక్ష మార్గాల ద్వారా దక్షిణ భారతదేశంలోని పోర్టులను మధ్య భారతదేశంలోని పోర్టులకు అనుసంధానించడమే ఈ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే యొక్క ప్రాథమిక లక్ష్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =