హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు-2022 సహా మరో అంతర్జాతీయ అవార్డు దక్కడంపై సీఎం కేసీఆర్ హర్షం

CM KCR Expressed Happiness on Hyderabad City Winning Prestigious International Association of Horticulture Producers Awards, Hyderabad City Winning Prestigious International Association of Horticulture Producers Awards, International Association of Horticulture Producers Awards, Telangana CM KCR, Hyderabad City, AIPH awards, World Green City Award 2022, 2022 World Green City Award, Hyderabad City News, Hyderabad City Latest News And Updates, Mango News, Mango News Telugu

హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మక “ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ ప్రొడ్యూసర్స్‌” (ఏఐపీహెఛ్) అవార్డులు దక్కడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ‘గ్రీన్ సిటీ అవార్డు-2022’ మరియు ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్’ అవార్డులను హైదరాబాద్ గెలుచుకున్న సందర్భంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని సీఎం అభినందించారు. ఈ అంతర్జాతీయ అవార్డులు, తెలంగాణతో పాటు దేశ ప్రతిష్టను ఇనుమడింప జేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్న, హరితహారం “పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, దేశానికి పచ్చదనపు ఫలాలు” అందిస్తున్నాయనడానికి ఈ అంతర్జాతీయ అవార్డులే నిదర్శనం అన్నారు.

ప్రపంచ నగరాలతో పోటీ పడి, భారతదేశం నుండి ఈ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గర్వించదగ్గ విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని మరింత ఆకుపచ్చగా మార్చుతూ, హరిత భారతాన్ని రూపుదిద్దే దిశగా కృషిని కొనసాగించాలని సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ద్వారా చేస్తున్న కృషి, అవలంబిస్తున్న పర్యావరణ సానుకూలత విధానాలు, అటు తెలంగాణనే కాకుండా భారత దేశాన్ని, ప్రపంచ పచ్చదనం వేదికపై సగర్వంగా నిలిచేలా చేసిందని, ఇది యావత్ ప్రపంచం గర్వించదగ్గ విషయమని సీఎం కేసీఆర్ అన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY