ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం.. 11న నోటిఫికేషన్

Preparation for MLA Election Notification on 11th, Preparation for MLA Election, MLA Election Notification on 11th, MLC Elections, Telangana, MLA Quota MLC Elections, Latest MLC Elections Notification, MLC Elections Notification News, MLC Elections 2024, MLC, TS Elections News, Telangana Elections, TS CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Preparation for MLA Election Notification on 11th, Preparation for MLA Election, MLA Election Notification on 11th, MLC Elections, Telangana, MLA Quota MLC Elections, Latest MLC Elections Notification, MLC Elections Notification News, MLC Elections 2024, MLC, TS Elections News, Telangana Elections, TS CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోతే.. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. ఇక త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే లోక్ సభ ఎన్నికలకంటే ముందే.. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 11న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి గెలుపొందగా.. అటు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ  చేసిన కడియం శ్రీహరి కూడా విజయం సాధించారు. దీంతో వారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈక్రమంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు జనవరి 11న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. జనవరి 18 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. జనవరి 19 వరకు నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు జనవరి 22 వరకు గడువు ఇచ్చారు. ఇక జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. అదే రోజున కౌంటింగ్ కూడా జరగనుంది.

అయితే ఈసారి ఎమ్మెల్సీ పదవి కోసం చాలా మంది సీనియర్ నేతలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కనివారు.. టికెట్ త్యాగం చేసినవాళ్లు.. ఎటువంటి పదవి లేకుండా చాలా కాలంగా పార్టీలో కీలకంగా ఉన్న నేతలంతా ఎమ్మెల్సీ పదవిపై కన్నేశారట. తమకే ఈసారి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని పట్టుపట్టుకొని కూర్చుకున్నారట. ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, బండ్ల గణేష్, రాములు నాయక్‌, నరేందర్ రెడ్డిలతో పాటు మరికొంత మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నారట.

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం.. ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్‌ల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వారికే ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని అనుకుంటున్నారట. మరి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది..? రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మిగిలిన సీనియర్ నేతలు అంగీకరిస్తారా..? లేదా..? అనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =