మునుగోడు ఉపఎన్నిక ముందు టీఆర్ఎస్‌కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

Telangana Former Bhongir MP Boora Narsaiah Goud Resigns For TRS Party Ahead of Munugode By-poll, Munugode By-poll, Munugode By-Election, Former Bhongir MP Boora Narsaiah Goud Resigns, Telangana Former Bhongir MP, Boora Narsaiah Goud Resigns, TRS Party, Munugode By-poll News, Munugode By-poll Latest News And Updates, Munugode By-poll Live Updates, Mango News, Mango News Telugu

మునుగోడు ఉపఎన్నికకు ముందు టీఆర్ఎస్‌ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖను పంపారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశానని, టీఆర్ఎస్‌ పార్టీలో తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని ఆయన లేఖలో పేర్కొన్నారు. మునుగోడులో తనకు టికెట్ ఇవ్వకపోవడం అనేది పెద్ద విషయం కాదని, అయితే బీసీ వర్గానికి చెందిన ఇంకెవరికైనా ఇవ్వమని చెప్పినా పార్టీ అధినేతగా కేసీఆర్‌ వినిపించుకోలేదని మాజీ ఎంపీ తెలిపారు. సీఎం కేసీఆర్ అంటే తనకు అభిమానం ఉన్నా.. పార్టీలో గుర్తింపు లేనప్పుడు అవమానాల్ని దిగమింగుకుంటూ ఉండలేనని, అందుకే పార్టీకి రాజయినామా చేస్తున్నానని లేఖలో నర్సయ్య వెల్లడించారు.

అయితే నర్సయ్య గౌడ్ మునుగోడు ఉపఎన్నిక టికెట్ ఆశించినట్లు వార్తలు వచ్చాయి. కానీ సీఎం కేసీఆర్‌ ఆయనను కాదని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా నర్సయ్య గౌడ్ 2014లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్‌ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2019లో అదే స్థానం నుంచి పోటీ చేయగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు. కాగా మాజీ ఎంపీ రాజీనామా నిర్ణయంతో గౌడ సామాజికవర్గం బలంగా ఉన్న మునుగోడులో అధికార టీఆర్ఎస్‌కు కొంత నష్టం జరగొచ్చు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇక నర్సయ్య గౌడ్ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. నల్లగొండలో ప్రముఖ లాప్రోస్కోపిక్‌ సర్జన్‌గా జనాదరణ పొందిన బూర నర్సయ్య గౌడ్‌కు బలమైన బీసీ నాయకుడిగా జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. దీంతో బీజేపీ నాయకులు ఆయనను పార్టీలోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గురువారమే ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర ఇంచార్జి తరుణ్‌ ఛుగ్‌తో కలిసి ఆయన శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వద్దను కలిసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. అలాగే నర్సయ్య గౌడ్, శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కూడా కోరారని, ఆయనను కలిసి తరువాత అధికారికంగా పార్టీలో చేరనున్నట్లు ప్రకటన వెలువడొచ్చని భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + fourteen =