అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవికి జరిగిన ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కాగా కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే మరియు శశి థరూర్‌లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలోని దాదాపు 9,500 మంది ప్రతినిధులు తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 68 పోలింగ్ బూతుల నుంచి బ్యాలెట్ బాక్సులు న్యూఢిల్లీ లోని అక్బర్ రోడ్డులో గల కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోని కౌంటింగ్ స్థలానికి చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
ఇక కాంగ్రెస్ 137 ఏళ్ల చరిత్రలో పార్టీ అధినేత పదవికి ఎన్నికలు జరగడం ఆరోసారి మాత్రమే. ఈ పోటీలో మల్లికార్జున్ ఖర్గేకే గెలిచే అవకాశాలున్నట్లు పార్టీలోని మెజారిటీ వర్గం భావిస్తోంది. కాగా మల్లికార్జున్ ఖర్గే గాంధీ కుటుంబానికి తొలినుంచీ హార్డ్ కోర్ విధేయుడుగా ఉండగా.. శశిథరూర్ మాత్రం ఐక్యరాజ్యసమితిలో సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత 2009లో కాంగ్రెస్‌లో చేరారు. అయితే విజేతగా నిలిచినవారు దీపావళి తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని పార్టీ అధినేత రావడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంతో రాహుల్ గాంధీ పదవి నుంచి వైదొలగడంతో అప్పటినుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY