కొత్త వేరియంట్స్ నేపథ్యంలో దేశంలో కోవిడ్-19 పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశం

Union Health Minister Mansukh Mandaviya held High Level Meeting to Review COVID-19 Status in the Country, Union Health Minister Mansukh Mandaviya, Mansukh Mandaviya Review COVID-19 Status, Mansukh Mandaviya Meet on COVID-19 Status, Mango News, Mango News Telugu, COVID19 Cases In India, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Indian COVID News, Mansukh Mandaviya COVID-19 Status in India

దేశంలోని కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి, వ్యాక్సినేషన్ డ్రైవ్ పరిస్థితి మరియు పలు దేశాల్లో వెలుగుచూస్తున్న కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్స్ పై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మంగళవారం ప్రజారోగ్య నిపుణులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వికె పాల్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల పెరుగుదల యొక్క వివరాలు, ప్రధానంగా యూరప్‌లో మరియు ప్రపంచంలోని వివిధ ఓమిక్రాన్ వేరియంట్‌ల విశ్లేషణపై వివరణాత్మక ప్రదర్శనను అందించారు. అలాగే దేశంలో కోవిడ్-19 కేసుల ట్రెండ్‌, దేశంలోని కోవిడ్-19 పరిస్థితి, రోజువారీ కేసులు నమోదు, యాక్టివ్ కేసులు, కేస్ పాజిటివిటీ మరియు టెస్టింగ్ స్టేటస్‌తో పాటు ప్రతి మిలియన్‌కు రాష్ట్రాల వారీగా ప్రతి వారం ఎన్ని పరీక్షలు నిర్వహించబడుతున్నాయి?, ఇందులో ఎన్ని ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు ఉన్నాయనే విషయాలపై వివరణాత్మక విశ్లేషణ చేశారు. అదేవిధంగా దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రస్తుత స్థితి, వ్యాక్సిన్‌ల లభ్యత, వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై రాష్ట్రాల వారీగా విశ్లేషణ మరియు దేశంలో నెమ్మదిగా సాగుతున్న ప్రికాషన్ డోస్ పంపిణీపై డాక్టర్ మనోహర్ అగ్నాని పప్రెజెంటేషన్ ఇచ్చారు.

అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని సకాలంలో అంచనా వేయడానికి మరియు నియంత్రించడానికి తగిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయడంతో పాటుగా, సమర్థవంతమైన కోవిడ్-19 నిఘా చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా నిఘాపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇతర దేశాలలో ఒమిక్రాన్ వేరియంట్‌ల గుర్తింపు నేపథ్యంలో దేశంలో ఏదైనా సాధ్యమయ్యే మ్యుటేషన్ కోసం స్కాన్ చేయడానికి హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని సూచించారు. కోవిడ్-19 కారణంగా ఆసుపత్రిలో చేరేవారిని నిశితంగా పర్యవేక్షించాలని, అర్హులైన లబ్ధిదారులకు ప్రికాషన్ డోస్ సహా వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌ల ఆవిర్భావంతో, చాలా దేశాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయని, దేశంలో ఎంట్రీ పాయింట్ల వద్ద పర్యవేక్షణ మరింత పెంచాలని అన్నారు. ముఖ్యంగా రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ సముచిత ప్రవర్తన యొక్క నిరంతర అమలు కోసం దేశంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 3 =