అమర్‌నాథ్‌లో ఆకస్మిక వరదలు.. 15 మంది భక్తుల సజీవ సమాధి, మరో 40 మంది గల్లంతు

Amarnath Cloudburst 15 Pilgrims Lost Lives and Over 40 Missing After Heavy Floods at Shrine, 15 Pilgrims Lost Lives and Over 40 Missing After Heavy Floods at Shrine, 40 Missing After Heavy Floods at Shrine, 15 Pilgrims Lost Lives Due To Heavy Floods at Shrine, Heavy Floods at Shrine, Amarnath Cloudburst, At least 15 dead And many More injured after cloudburst in Amarnath, cloudburst in Amarnath, Rescue Operations Underway Near Amarnath, Shri Amarnath Cave Temple, Amarnath Cloudburst News, Amarnath Cloudburst Latest News, Amarnath Cloudburst Latest Updates, Amarnath Cloudburst Live Updates, Mango News, Mango News Telugu,

అమర్‌నాథ్‌ యాత్రలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఆ మహాదేవుడిని దర్శించటానికి వచ్చిన భక్తులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. శుక్రవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి ఆకస్మిక వరద పోటెత్తింది. దీంతో అమర్‌నాథ్‌ గుహ పరిసరాల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యాంపుల వద్దకి వరద నీరు భారీగా చేరుకుంది. ఒక్కసారిగా వచ్చి పడిన వరదలో అక్కడ సేద తీరుతున్న యాత్రికులు చిక్కుకుపోయారు. గుడారాలతో పాటు యాత్రికులు వరదలో కొట్టుకుపోయినట్లు సమీపం నుంచి చూసినవారు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 15 మంది మ‌ర‌ణించారని, మరో 40 మంది వ‌ర‌కు కొట్టుకుపోయి ఉంటార‌ని, వారి స‌మాచారం ఇంకా తెలియ‌లేద‌ని ఐటీబీపీ పీఆర్వో వివేక్ కుమార్ పాండే తెలిపారు. గాయ‌ప‌డ్డ‌వారిని హెలికాప్ట‌ర్ల ద్వారా బేస్ క్యాంప్‌కు తరలిస్తున్నారు. ప్ర‌స్తుతం యాత్ర‌ను తటాకాలికంగా నిలిపివేశామ‌ని పేర్కొన్నారు. కాగా అయితే వరదలో కొట్టుకుపోయినవారి సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కుంభవృష్టి సమయంలో అమర్‌నాథ్‌లో దాదాపు 12 వేల మంది భక్తులున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బాధితుల కోసం ఏర్పాటు చేసిన అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్లు

  • ఎన్డీఆర్ఎఫ్ – 011-23438252, 011-23438253
  • కాశ్మీర్ డివిజనల్ హెల్ప్‌లైన్ – 0194-2496240
  • అమరనాథ్ క్షేత్రం బోర్డు హెల్ప్‌లైన్ – 0194-2313149
  • జమ్మూ టోల్ ఫ్రీ నంబర్ – 18001807198
  • శ్రీనగర్ టోల్ ఫ్రీ నంబర్ – 18001807199
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 6 =