మునుగోడులో 11వ రౌండ్ లో కూడా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి 7,235, బీజేపీకి 5,877 ఓట్లు పోలయ్యాయి. 11వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి 1,358 ఓట్ల ఆధిక్యం లభించింది. 11వ రౌండ్ కౌంటింగ్ అనంతరం టీఆర్‌ఎస్ 5,774 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
మునుగోడులో ఇప్పటివరకు 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకెళ్తుంది. 10 రౌండ్ల కౌంటింగ్ అనంతరం తన సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 4,440 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పదో రౌండ్ లో టీఆర్‌ఎస్ కు 7503, బీజేపీకి 7015, కాంగ్రెస్ కు 1347 ఓట్లు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు టీఆర్‌ఎస్ కు మొత్తం 67,363, బీజేపీకి 62,923, కాంగ్రెస్ కు 17627 ఓట్లు లభించాయి.
తొమ్మిదో రౌండ్:
- టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 7497 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 59860
- బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లు: 6665 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 55908
- కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి వచ్చిన ఓట్లు: 1300 – ఈ రౌండ్ వరకు మొత్తం ఓట్లు – 16280
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE