ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచి రోజులు తీసుకొస్తుంది, ప్రధాని మోదీతో భేటీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Meets PM Modi at Vizag and Discusses State Issues, Pawan Kalyan Meets PM Modi at Vizag and Discusses State Issues, AP State Issues, PM Modi at Vizag, PM Modi Vizag Tour, PM Modi Vizag Visit, Janasena Chief Pawan Kalyan, PM Modi in Visakhapatnam, Prime Minister Narendra Modi, Narendra Modi, PM Narendra Modi in Visakhapatnam, PM Modi Vizag Tour News, PM Modi Vizag Tour Latest News And Updates, PM Modi Vizag Tour Live Updates, Mango News, Mango News Telugu

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి విశాఖ పర్యటనకు విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో తూర్పు నౌకాదళ స్థావరంలోని ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ భేటీ అయ్యారు. సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర విషయాల పట్ల చర్చించామని, కచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు మంచి రోజులు తెచ్చే సమావేశం అని అన్నారు.

దాదాపు 8 సంవత్సరాలు తర్వాత ప్రధాని మోదీని కలవడం సంతోషంగా ఉందని, 2014 ఎన్నికల ముందు మోదీతో కలిసి ఎన్నికల ప్రచారం తర్వాత మళ్లీ ఆయనను కలవలేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. “ఇప్పుడు రాష్ట్ర పర్యటన సందర్భంగా రెండు రోజులు క్రితం ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని మోదీని కలవాలని చెప్పడంతో ఈ రోజు ఆయనతో పలు విషయాల పట్ల చర్చించాం. రాష్ట్రంలోని వివిధ అంశాలను, పరిస్థితులను ప్రధాని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటిపై నా వద్ద ఉన్న సమాచారాన్ని ఆయనతో పంచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి అన్నది ప్రధాని ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలన్నదే మోదీ కోరుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీతో ఈ సమావేశం జరిగింది. కచ్చితంగా దీని ఫలితాలు ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, భవిష్యత్తు కోసం ఉంటాయి” అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెంట పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పలువురు నాయకులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − five =