తెలంగాణలోని రామగుండంలో నేడే ప్రధాని మోదీ పర్యటన, పూర్తి షెడ్యూల్ ఇదే…

PM Modi Telangana Tour Schedule: PM to Dedicate Fertilizer Plant at Ramagundam to the Nation Today, PM to Dedicate Fertilizer Plant at Ramagundam to the Nation Today, Fertilizer Plant to the Nation, PM Modi Telangana Tour Schedule, Fertilizer Plant at Ramagundam, Ramagundam Fertilizer Plant, Fertilizer Plant, PM Modi Telangana Tour, PM Modi at Telangana, PM Modi Telangana Visit, PM Modi in Telangana, Prime Minister Narendra Modi, Narendra Modi, PM Narendra Modi in Telangana, PM Modi Telangana Tour News, PM Modi Telangana Tour Latest News And Updates, PM Modi Telangana Tour Live Updates, Mango News, Mango News Telugu

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (నవంబర్ 12, శనివారం) తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రామగుండంలో జరిగే సభ నుంచి రాష్ట్రంలో రూ.9500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా రామగుండంలో ఎరువుల ప్లాంట్‌ను/రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. రామగుండం ప్రాజెక్టుకు 2016, ఆగస్టు 7న ప్రధాని మోదీనే శంకుస్థాపన చేశారు. రామగుండం ప్లాంట్ సంవత్సరానికి 12.7 ఎల్ఎంటీ దేశీయ వేప పూతతో కూడిన యూరియా ఉత్పత్తి చేస్తుంది. కాగా రామగుండం ఎరువుల ప్లాంట్‌ లో 2021, మార్చి 22 నుంచే యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. మరోవైపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్

  • మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖ నుండి హైదరాబాద్ కు బయలుదేరనున్న ప్రధాని మోదీ
  • మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ప్రధాని మోదీ
  • ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు, స్వాగతం పలకనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఉన్నతాధికారులు, బీజేపీ నేతలు
  • రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానికి స్వాగతం పలుకనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
  • మధ్యాహ్నం 2.05 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టులో స్వాగత సభ, బీజేపీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ
  • మధ్యాహ్నం 2.15 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి రామగుండంకు బయలుదేరి, 3.20 గంటలకు రామగుండం హెలీప్యాడ్ కు చేరుకోనున్న ప్రధాని
  • అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఆర్‌ఎఫ్‌సీఎల్‌/ఎరువుల ఫ్యాక్టరీకి చేరుకోనున్నారు
  • మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల వరకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్లాంట్ పరిశీలించనున్న ప్రధాని
  • సాయంత్రం 4.15 గంటలకు ఎన్టీపీసీ మైదానంలో రైతులు, ప్రజలతో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ
  • ఈ సభ నుంచే ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ను జాతికి అంకితం చేయడంతో పాటు పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని మోదీ
  • అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం
  • సభ అనంతరం రామగుండం నుండి సాయంత్రం 6.30 గంటలకు బేగంపేటకు చేరుకోనున్నారు
  • సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి పయనమవనున్న ప్రధాని మోదీ.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన కార్యక్రమాలు:

  • రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను ప్రధాని జాతికి అంకితం
  • దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.
  • రూ.2200 కోట్లకు పైగా విలువైన వివిధ రహదారుల ప్రాజెక్టులకు (మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి-NH- 765డీజీ, బోధన్‌-బాసర-భైంసా-NH-161 బీబీ, సిరొంచా-మహదేవ్‌పూర్‌-NH-353సీ) ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
  • అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =