సీఎం జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Capital Amaravati, AP Capital Issue, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, CM YS Jagan in Tadepalli Camp Office, High Power Committee Meets CM YS Jagan, Mango News Telugu, Political News Today, YS Jagan Latest News
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు కమిటీ మరియు బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్‌ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. హైపవర్ కమిటీ ఇప్పటికే మూడు సార్లు సమావేశమై జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ ఇచ్చిన నివేదికలను పరిశీలించి విస్తృతంగా చర్చించింది. ఈ నేపథ్యంలో హైపవర్‌ కమిటీ జనవరి 17, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో సమావేశం అయింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతుంది. ఈ సందర్భంగా నివేదికలలో పరిశీలించిన కీలక అంశాలపై హైపవర్‌ కమిటీ సభ్యులు సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు.
మరో వైపు అమరావతి ప్రాంత రైతులు సమస్యలపై కూడా సీఎంతో చర్చించనున్నారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తమ సమస్యలను, అభ్యంతరాలను సిఆర్‌డిఎ కమిషనర్‌కు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 3000 మందికి పైగా రైతులు తమ అభిప్రాయాలను తెలిపినట్లుగా అధికారులు పేర్కోవడంతో ఈ అంశంపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =