తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జోగి రమేష్. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నరసాపురంలో సీఎం జగన్ ప్రసంగాన్ని ఉద్దేశించి టీడీపీ నేతలు రకరకాలుగా మాట్లాడుతున్నారని, సీఎం అన్న మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. సీఎం జగన్ చెప్పినట్లే టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అని, అలాగే జనసేన కాదు రౌడీ సేన అని మంత్రి వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో సీఎం జగన్ విజయాన్ని అడ్డుకోవడం చంద్రబాబు వల్ల కాదని, అది అర్ధమయ్యే ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ సాయం తీసుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
ఇక బాదుడే బాదుడు కార్యక్రమం గురించి చంద్రబాబు చెప్పడమే కానీ, ప్రజల్లో ఎలాంటి స్పందన లేదని జోగి రమేష్ తెలిపారు. అందుకే ఆయన ఉక్రోషంతో సీఎం జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, తన వయస్సుని కూడా మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజలకు ఏమీ చేయలేదని, కనుకే కుప్పంలో కూడా టీడీపీని ఓడించారని అన్నారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల వద్దకు ఎమ్మెల్యేలను పంపి వారి సమస్యలను పరిష్కరిస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యం అని, చంద్రబాబు కుప్పంలో కూడా గెలవలేరని జోగి రమేష్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE







































