బంగ్లాతో మూడో వన్డేకి కెప్టెన్ గా కేఎల్ రాహుల్, కుల్దీప్ కు చోటు, రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ ప్రకటన

BCCI announces Indian Squad For 3rd ODI Against Bangladesh KL Rahul as Captain Kuldeep Yadav Into Team,India vs Bangladesh,3 match ODI Series, Kuldeep Sen, Shahbaz Ahmed Replaces Yash Dayal, Jadeja,Mango News ,Mango News Telugu,India Vs Bangladesh,IND VS Bangladesh,IND vs BNG,India vs Bangladesh 3-match ODI Series,Indian Cricket Team,Bangladesh Cricket Team,India,Bangladesh,Bangladesh vs India, India in Bangladesh, 3rd ODI Match,KL Rahul as Captain,Kuldeep Yadav Into Team

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే రేపు (డిసెంబర్ 10, శనివారం) ఉదయం 11.30 గంటల నుంచి జరగనుంది. బంగ్లాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లో భారత్ జట్టు పరాజయం పాలవగా, రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. అలాగే డిసెంబర్ 14-18, 22-26 మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గాయంతో పాటుగా, బంగ్లాదేశ్ తో మూడో వన్డే కోసం భారత్ జట్టులో చోటుచేసుకున్న మార్పులపై బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. బంగ్లాదేశ్ తో మూడో వన్డేకి కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కుల్దీప్ యాదవ్‌ ను చివరి వన్డే కోసం భారత జట్టులో చేర్చింది.

“రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బొటన వేలికి దెబ్బ తగిలింది. బీసీసీఐ వైద్య బృందం అతనిని పరిశీలించింది మరియు ఢాకాలోని స్థానిక ఆసుపత్రిలో అతనికి స్కానింగ్ చేయడం జరిగింది. అయితే స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కోసం రోహిత్ శర్మ ముంబయికి వెళ్లాడు, దీంతో చివరి వన్డేకి దూరమయ్యాడు. కాగా రాబోయే టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై నిర్ణయం తర్వాత తీసుకోబడుతుంది” అని బీసీసీఐ తెలిపింది.

ఇక మొదటి వన్డే తర్వాత ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ తన వెన్నులో స్టిఫ్ నెస్ ఉందని ఫిర్యాదు చేశాడని, బీసీసీఐ వైద్య బృందం అతడిని పరిశీలించి 2వ వన్డే నుంచి విశ్రాంతి తీసుకోవాలని సూచించిందని చెప్పారు. ఒత్తిడి గాయంతో బాధపడుతున్న కుల్దీప్ సేన్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడని తెలిపారు. మరో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా 2వ వన్డే సమయంలో ఎడమ హార్మస్టింగ్ స్ట్రెయిన్‌తో బాధపడడంతో, అతను కూడా సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో కుల్దీప్ సేన్ మరియు దీపక్ చాహర్ ఇద్దరూ ఇప్పుడు వారి గాయాల నిర్వహణ కోసం బెంగళూరులోని ఎన్సీఏకి రిపోర్ట్ చేస్తారని బీసీసీఐ తెలిపింది.

బంగ్లాదేశ్‌తో జరిగే 3వ వన్డేకు భారత్ జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్) (వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 13 =