బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కార్యక్రమం హైలెట్స్ ఇవే…

Highlights of BRS Party Formation Celebrations at Telangana Bhavan,BRS Foundation Ceremony,Grandly Held At Telangana Bhavan,CM KCR Unveiled BRS flag,Mango News,Mango News Telugu,Approval Telangana Rashtra Samithi,Bharat Rashtra Samithi,BRS Emergence Program,Telangana Rashtra Samithi,TRS Party Name Change,BRS Party,TRS Party,TRS Latest News and Updates,BRS Party News and Live Updates,BRS Party Emergence,Election Commision Of India,Telangana BRS Party,TRS Party News,Emergence BRS Programe,TRS News and Updates,BRS National Party,TRS Name Change,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana CM KCR

తెలంగాణ భ‌వ‌న్‌లో ఈరోజు (డిసెంబర్ 9, శుక్రవారం) “భార‌త్ రాష్ట్ర స‌మితి” పార్టీ ఆవిర్భావ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కు జేడీఎస్ చీఫ్ కుమార‌స్వామి, న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, రైతు సంఘాల నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కార్యక్రమం – హైలెట్స్:

  • మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొని, సీఎం కేసీఆర్ తర్వాత నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకొని, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు
  • అనంతరం తెలంగాణ భవన్‌లో త్రైలోక్య మోహన గౌరీ అమ్మవారికి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు సీఎంను ఆశీర్వాదించారు.
  • అనంతరం జయజయధ్వానాల మధ్య, బీఆర్ఎస్ పార్టీ గులాబీ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
  • బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ పూజా కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో సీఎం కేసీఆర్ గుమ్మడికాయ కొట్టించారు.
  • ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల దివ్య ముహూర్త సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారిక పత్రాలపై పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు.
  • బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తొలి పలుకులతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర రావు మాట్లాడారు.
  • ఈ సందర్భంగా కర్నాటక జెడిఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితో భారతదేశంలో గుణాత్మక మార్పు వస్తుందనే సంపూర్ణ విశ్వాసముందని తనకుందని తెలిపారు.
  • ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో అట్ట‌హాసంగా జ‌రిగాయి.
  • బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు అభిమానుల కేరింతలతో, బాణాసంచా కాల్పులతో మారుమోగింది. పార్టీ నేతల దేశ్ కి నేత కేసీఆర్, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, బీఆర్ఎస్ జిందాబాద్ నినాదాలతో మారుమోగింది.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తోపాటు మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, రాజ్యసభ, లోక్ సభ పక్షనేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావుతో పాటు రాజ్యసభ, లోక్ సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, మేయర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, అన్ని కార్పోరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డిసీసీబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నాయ‌కులు, హర్యానా నుంచి గుర్నామ్ సింగ్, ఒడిస్సా నుండి అక్షయ్ కుమార్, హిమాంశు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 2 =