‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొననున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్, డిసెంబర్ 24న ఢిల్లీలో రాహుల్ యాత్రకు హాజరు

Bharat Jodo Yatra Actor Kamal Haasan To Walk with Rahul Gandhi in Delhi on December 24,Rahul Bharat Jodo Yatra,Kamal Haasan To Walk with Rahul,Kamal Haasan In Bharat Jodo Yatra,Mango News,Mango News Telugu,Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress, Rahul Gandhi Padha Yatra, Congress Party , Indian National Congress, INC Latest News and Updates, Sonia Gandhi, Priyanka Gandhi, Rahul Gandhi, Congress president Mallikarjun Kharge,Parliament Winter Session,Parliament Winter Session Skip,Parliament Winter Session Rahul Gandhi

ప్రముఖ నటుడు, ‘మక్కల్ నీది మయ్యం’ (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ త్వరలో కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొననున్నారు. ఈ మేరకు కమల్ హాసన్ డిసెంబరు 24న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో కలిసి నడవనున్నట్లు ఆయన పార్టీ ప్రకటించింది. అయితే రాహుల్ ఆహ్వానం మేరకే కమల్ హాసన్ యాత్రలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారని ఎంఎన్ఎం పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో తనతో కలిసి నడవావాలని రాహుల్ గాంధీ ఒక లేఖ రాశారని, దీనికి కమల్ హాసన్ సుముఖుత వ్యక్తం చేశారని వెల్లడించాయి. ఇక రాహుల్ యాత్రలో చేరిన రెండవ ప్రసిద్ధ తమిళ రాజకీయ నాయకుడు కమల్ హాసన్ అని తమిళనాడులోని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నారు. గత నెలలో, ఎండీఎంకే వ్యవస్థాపకుడు మరియు డీఎంకే మిత్రపక్షం వైకో కుమారుడు దురై వైకో హైదరాబాద్‌లో రాహుల్‌తో కలిసి దాదాపు 30 నిమిషాల పాటు నడిచారు.

కాగా తాజాగా కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయంపై తమిళనాట సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇక 2018లో పార్టీ ప్రారంభించినప్పడు మక్కల్ నీది మయ్యం తమిళనాడులో జరిగే అన్ని ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని కమల్ హాసన్ ప్రకటించడం గమనార్హం. అలాగే ఎంఎన్ఎం ఇప్పటివరకు ఏ పొత్తులతో పొత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగా ప్రజల మద్దతును పొందే ప్రయత్నం చేసింది. కానీ అనుకున్నంతగా కమల్ పార్టీ ప్రజాదరణ పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎంఎన్‌ఎం తన పంథా మార్చుకుని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే మరియు కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా తమిళనాడులో కాంగ్రెస్ అనుకూల భాగస్వామ్య పక్షంగా ఉన్న అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కమల్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ చేరే అవకాశాలున్నాయని వారు విశ్లేషిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE