రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

Google CEO Sundar Pichai Called on President Droupadi Murmu at Rashtrapati Bhavan Today,President Draupadi Murmu, Draupadi Murmu Google CEO Meet,Google CEO Sundar Pichai,President Meet Sundar Pichai, Draupadi Murmu Inaugurate National Highways,Mango News,Mango News Telugu,Vijayawada Visit By Draupadi Murmu,Indian President Draupadi Murmu,Draupadi Murmu Latest News And Updates,Sundar Pichai Latest News and Updates,Sundar Pichai News and Live Updates,Sundar Pichai Met Draupadi Murmu,Google Ceo India

గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సుందర్ పిచాయ్ ఈ రోజు (డిసెంబర్ 19, సోమవారం) రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్‌ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుందర్ పిచాయ్ భేటీ పోటోలను షేర్ చేశారు. పద్మభూషణ్ గ్రహీత సుందర్ పిచాయ్ భారతీయ ప్రతిభకు, తెలివితేటలకి ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు మరియు భారతదేశంలో సార్వత్రిక డిజిటల్ అక్షరాస్యత (యూనివర్సల్ డిజిటల్ లిటరసీ) కోసం కృషి చేయాలని సుందర్ పిచాయ్ ను రాష్ట్రపతి కోరారు.

అనంతరం న్యూఢిల్లీలో జరిగిన గూగుల్ ఫర్ ఇండియా-2022 సమావేశంలో సుందర్ పిచాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, ఆర్టిఫిసియల్ ఇంటిలెజెన్స్ (ఏఐ) అత్యంత ప్రభావం చూపుతుందని మరియు ప్రతి రంగాన్ని తాకుతుందన్నారు. ఏఐపై దృష్టి తమ మిషన్‌కు ప్రధానమైనదని పేర్కొన్నారు. అలాగే గూగుల్ ఫర్ ఇండియా సమావేశంలో జరిగిన చర్చలో సుందర్ పిచాయ్ తో పాటుగా కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. మరోవైపు ఈ సమావేశం సందర్భంగా దేశంలో సైబర్ సెక్యూరిటీ ఆవిష్కరణల కోసం గూగుల్ 10 బిలియన్ డాలర్స్ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =