ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. డీఎస్సీ 1998 అభ్యర్థులకు త్వరగా పోస్టింగులు కేటాయించాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈమేరకు ఆయన గురువారం పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సహా పలువురు విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాల విద్యాశాఖపై సమీక్షలో భాగంగా సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు, ఆదేశాలు..
- డీఎస్సీ 1998 అభ్యర్థులకు ఖాళీలను బట్టి త్వరగా పోస్టింగ్స్ కేటాయించాలి.
- రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌ల నిర్వహణపై దృష్టి పెట్టాలి.
- డేటా అనలిటిక్స్ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన ఉండాలి.
- అందుకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు తగిన చర్యలు తీసుకోవాలి.
- తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి.
- ఈ డిజిటల్ స్క్రీన్‌లతో విద్యార్థులు అత్యుత్తమ విద్యనభ్యసించే విధంగా తీర్చిదిద్దాలి.
- వీటిని ఉపయోగించి ఎలా బోధించాలనే దానిపై ఉపాధ్యాయులకు ముందుగా శిక్షణ ఇవ్వాలి.
- వచ్చే విద్యా సంవత్సరం జగనన్న విద్యా కానుకకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి.
- అన్ని పాఠశాలలు, అంగన్ వాడీలకు సార్టెక్స్ పోర్టిఫైడ్ బియ్యాన్ని మాత్రమే సరఫరా చేయాలి.
- వీటితోపాటు అన్ని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లకు ప్రత్యేక లేబుల్‌తో ఈ బియ్యాన్ని సరఫరా చేయాలి.
- ఇక ముఖ్యంగా ప్రస్తుతం ఇస్తున్న ఆహారంతో పాటు బడి పిల్లలకు బెల్లం, కాపర్ మాల్ట్ ఇవ్వాలి.
- అలాగే ఐరన్ మరియు కాల్షియం లోప నివారణకు ఫిబ్రవరి 1 నుంచి వారానికి మూడు రోజులు పిల్లలకు ఒక గ్లాసు రాగి మాల్ట్ అందించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE