ఏపీ ఎడ్ సెట్-2022: మొదటి దశ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల

AP EDCET-2022 Schedule of First Phase Counselling Released For The Admissions, AP EDCET-2022, AP EDCET First Phase Counselling, AP EDCET Counselling, Mango News, Mango News Telugu, AP EDCET, AP EDCET Latest News And Updates, AP EDCET-2022 Schedule, AP EDCET-2022 Schedule Released, Ap Edcet 2022 Counselling, Ap Edcet 2022 Counselling Phase 1, Ap Edcet Counselling Dates 2022, Ap Edcet Counselling Dates, EDCET-2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీఈడీ మరియు స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసిన ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఎడ్ సెట్-2022) మొదటి దశ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు గురువారం ఏపీ ఈడీ సీఈటీ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ కె.రామమోహన్ రావు అడ్మిషన్ షెడ్యూల్ వివరాలను విడుదల చేశారు. దీనిప్రకారం, వెబ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ అక్టోబర్ 22న ప్రారంభమై 27వ తేదీన ముగియనుండగా.. అక్టోబర్ 26 నుంచి 31వ తేదీ వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరుగనుంది. అలాగే స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఈనెల 27వ తేదీన ప్రత్యేకంగా విజయవాడ లయోలా కళాశాలలో సర్టిఫికేట్లు పరిశీలన చేపట్టనున్నారు. ఇక మొదటి దశ కౌన్సెలింగ్‌కు సంబంధించి నవంబర్ 1నుంచి 3వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. సీట్ల కేటాయింపు నవంబర్ 5వ తేదీన చేపట్టనున్నారు. అలాగే విద్యార్థులు నవంబర్ 7-9 తేదీల మధ్య కాలేజీలలో రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. నవంబర్ 7వ తేదీ నుంచి తరగతులు నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 17 =