ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. గుంటూరు నాగార్జున యూనివర్సిటీకి వెళ్లే వరకు తనకు రాజకీయాలు తెలియవని, గౌతమ్ రెడ్డి ద్వారానే విద్యార్థిగా ఉన్నప్పటినుంచి రాజకీయాలు తెలుసని అన్నారు. ఇక జగన్ తనకు గత 11 ఏళ్లుగా తెలుసని, అయితే ఇటీవలి వరకు ఏనాడూ ఆయనను కలవడానికి ప్రయత్నించలేదని తెలిపారు. తాను పదవులూ ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, అలాగే సీఎం జగన్ తనకు పదవి ఇస్తారనే ఉద్దేశంతో ఆయనకు మద్దతు పలకలేదని, అభిమానంతోనే ఆయన పార్టీలోకి వచ్చానని పోసాని స్పష్టం చేశారు.
ఇంకా పోసాని కృష్ణమురళి ఇలా అన్నారు.. చాలా మంది నాయకులు కులాలు, మతాలు, డబ్బు నుంచి పుడతారని.. కానీ జగన్ మాత్రం ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడని, అందుకే జగన్ అంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీకి ఎంత మంచి చేస్తానో తెలియదు గానీ, చెడు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో చేయనని చెప్పారు. గ్యారెంటీగా సినీ ఇండస్ట్రీకి సేవ చేస్తానని, తాను చనిపోయేవరకు వైసీపీ పార్టీలోనే ఉంటానని, జగన్ వెంటే నిలబడతానని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, మల్లాది విష్ణు, లక్ష్మీ పార్వతి, చల్లా మధుసూదన్ రెడ్డి, పున్నూరు గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE


































