ఫిబ్రవరి 6న తెలంగాణ బడ్జెట్, 8న బ‌డ్జెట్‌, ప‌ద్దుల‌పై సభలో కీలక చ‌ర్చ‌

BAC Meeting in Telangana Assembly Budget on FEB 6th Discussion over Budget on FEB 8th,Telangana Budget On 6Th February,Telangana Budget Important Discussion,House On Budget And Payments On 8Th,Mango News,Mango News Telugu,Telangana Govt To Present Budget,Telangana Govt Budget,Telangana Budget 2023 On Feb 3 Or Feb 5,Telangana Budget 2023,Mango News,Telangana Budget Wikipedia,Telangana Budget 2023 24,Telangana Budget 2023,Telangana Education Budget,Telangana Budget Date,Andhra Pradesh Budget,Telangana Budget 2022 Pdf,Telangana Budget 2023-24,Telangana Govt Budget 2020-21,Budget Of Telangana 2023,Structure Of Government Budget

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2023-24 సమావేశాలు ఈరోజు (ఫిబ్రవరి 3, శుక్రవారం) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా తొలిరోజు ఉభయసభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. ఇక గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బీఏసీ సమావేశంలో పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ సభాపక్ష నేత భట్టి విక్రమార్క, చీఫ్ విప్, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా ఫిబ్రవరి 6వ తేదీన అసెంబ్లీలో రాష్ట్ర బ‌డ్జెట్ 2023-24ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ.హరీశ్ రావు శాసనసభలో, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నారు.

రేపు (ఫిబ్రవరి 4, శనివారం) గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నట్టు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 5, 7 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. ఫిబ్రవరి 6న బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా, ఫిబ్రవరి 8వ తేదీన బడ్జెట్‌పై మరియు బడ్జెట్‌ పద్దులపై చర్చించనున్నారు. కాగా మిగతా అంశాలు, బడ్జెట్ సమావేశాలు ఎప్పటివరకు వరకు కొనసాగించాలననేది ఫిబ్రవరి 8న సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు బీఏసీ సమావేశం సందర్భంగా అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 4 =