ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలల్లోని సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఆహార (డైట్) ఛార్జీలను మరియు కాస్మెటిక్ చార్జీలను పెంచింది. ఈ మేరకు హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు సాంఘిక సంక్షేమ గృహాలు, బిసిలలో ఉండే విద్యార్థులకు నెలవారీ డైట్ ఛార్జీల రేట్లను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దీని ప్రకారం.. సంక్షేమం, గిరిజన సంక్షేమ మైనారిటీ సంక్షేమం డిఫరెంట్లీ ఏబుల్డ్ వెల్ఫేర్, జువైనల్ వెల్ఫేర్ మరియు పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలకు పెంచిన రేట్లు వచ్చే విద్యా సంవత్సరం 2023-24 (జూన్ 01, 2023) నుండి అమలులోకి వస్తాయి.
ఏపీ లోని రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యార్థులకు పెరిగిన నెలవారీ డైట్ ఛార్జీల వివరాలు..
- 3 మరియు 5వ తరగతి విద్యార్థులకు నెలవారీ డైట్ ఛార్జీలు రూ. 1,000 నుండి రూ. 1,150 కు పెంచబడ్డాయి.
- అదేవిధంగా, 5 నుండి 10వ తరగతి విద్యార్థులకు డైట్ ఛార్జీలు రూ. 1,250 నుండి రూ. 1,400 కు పెంచబడ్డాయి.
- ఇక ఇంటర్మీడియట్ మరియు అంతకు పైబడి తరగతుల విద్యార్థులకు ఛార్జీలు రూ.1,400 నుంచి రూ.1,600కి పెంచబడ్డాయి.
ఏపీ లోని రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యార్థులకు పెరిగిన నెలవారీ కాస్మెటిక్ ఛార్జీల వివరాలు..
- 3వ తరగతి నుంచి 6వ తరగతి విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు బాలురకు రూ.100 నుంచి రూ.125కు పెంచబడ్డాయి.
- అలాగే ఆయా తరగతుల బాలికలకు రూ.110 నుంచి రూ.130కి పెంచబడ్డాయి.
- 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న రూ.125 నుంచి బాలురకు రూ.150కి పెంచారు.
- అదే విధంగా ఆయా తరగతుల బాలికలకు రూ.160 నుంచి రూ.200కి పెంచారు.
- ఇంటర్మీడియట్, ఆపైన విద్యార్థులకు బాలురకు రూ.125 నుంచి రూ.200కు పెంచబడ్డాయి.
- అలాగే ఆయా తరగతుల బాలికలకు రూ.160 నుంచి రూ.250కి పెంచబడ్డాయి.
- 3వ తరగతి మరియు అంతకంటే ఎక్కువ తరగతుల విద్యార్థులకు హెయిర్ కట్ ఛార్జీలు బాలురకు రూ.30 నుండి రూ.50కి పెంచబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE