దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. ఒకవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ఆధారాలు సేకరించడంతో పాటు వరుస అరెస్టులు చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి అరుణ్ రామచంద్రపిళ్లైని అరెస్ట్ చేసినట్టుగా ఈడీ ప్రకటించింది. అయితే గత రెండు రోజలుగా ఈడీ అధికారులు రామచంద్ర పిళ్లైను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కీలక ఆధారాలు లభ్యమవడంతో ఆయనను అరెస్ట్ చేశారు. అలాగే అరుణ్ పిళ్ళైకి చెందిన వట్టినాగులాపల్లిలో రూ. 2.2 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు 11 మంది అరెస్టయ్యారు.
ఇక హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైను ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఈడీ పేర్కొంది. ఈ స్కామ్‌లో అభిషేక్ బోయిన్‌పల్లి, సమీర్ మహేంద్రూ, విజయ్ నాయర్ తదితరులకు రామచంద్ర పిళ్లై సహకరించారని ఈడీ భావిస్తోంది. ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లలో అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు కూడా ఉండటం తెలిసిందే. దీంతో అనేకసార్లు రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర ఏజెన్సీ కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసుకి సంబంధించి ఇప్పటి వరకూ అరెస్టైన వారిలో ఎక్కువమంది హైదరాబాద్‌కు చెందిన వారే ఉండటం గమనార్హం. అలాగే ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు తాజాగా బెయిల్ లభించింది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఇదే కేసుకి సంబంధించి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈరోజు సీబీఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మనీ లాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న శరత్ చంద్రారెడ్డి బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, నేడు దానిపై విచారణ జరుగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE