ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు

TDP President Chandrababu Naidu Pays Last Respects to Mulayam Singh Yadav in Saifai Uttar Pradesh, Chandrababu Pays Tribute to Mulayam Singh Yadav, TDP Chief Chandrababu Naidu, Former UP CM Mulayam Singh Yadav, Samajwadi Party Founder Mulayam Singh Yadav, Mango News, Mango News Telugu, Mulayam Singh Yadav Passes Away, Samajwadi Party Founder, Samajwadi Party, Mulayam Singh Yadav Dies, Mulayam Singh Yadav Dead, Mulayam Singh Yadav Passes Away, Samajwadi Party Founder Passes Away, Mulayam Singh Yadav Passes Away at 82,

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం చంద్రబాబు ఢిల్లీ నుంచి పార్టీ ఎంపీలతో కలిసి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, ఇటావా జిల్లాలోని ములాయం సింగ్ స్వగ్రామమైన సైఫయ్ కు చేరుకున్నారు. అనంతరం ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహం వద్ద పూలమాల ఉంచి నివాళి అర్పించారు. అలాగే ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, మాజీ యూపి సీఎం అఖిలేశ్ యాదవ్ ను, ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ పర్యటనలో చంద్రబాబుతో పాటుగా టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు ఉన్నారు. సైఫాయిలో ములాయం సింగ్ అంత్యక్రియలు ముగిసిన అనంతరం చంద్రబాబు తిరిగి ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి విజయవాడకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేస్తూ “ప్రియమైన సోదరుడు, సోషలిస్ట్ అనుభవజ్ఞుడు మరియు ప్రజల నేతాజీ అయిన ములాయం సింగ్ యాదవ్ జీకి తుది వీడ్కోలు చెప్పడానికి మరియు ఈ దుఃఖ సమయంలో తన కుటుంబానికి అండగా నిలబడాలని నేను యూపీలో ఉన్నాను” అని పేర్కొన్నారు.

ముందుగా ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. “ములాయం సింగ్ యాదవ్ జీ మరణవార్త తెలిసి చాలా బాధపడ్డాను. నేను ఈ రోజు ప్రియమైన సోదరుడిని కోల్పోయాను. 4 దశాబ్దాలుగా, తన ఆకర్షణ, వినయం మరియు భారత రాజకీయాలపై లోతైన అవగాహనతో నన్ను ఎప్పుడూ ఆకట్టుకునే ఈ ఓబీసీ ప్రముఖుడితో ఎక్కువ సమయం గడిపే అదృష్టం నాకు లభించింది. ములాయం ఒక అరుదైన మంచి మనిషి, మర్యాదపూర్వకంగా ఉండేవారు మరియు నిశ్శబ్దంగా తన సోషలిస్ట్ లక్ష్యాలను సాధించడం ద్వారా లక్షలాది మంది జీవితాలను మార్చారు, ఈ ప్రయాణంలో ఎంతో ఇష్టపడే మాస్ లీడర్‌గా మారాడు. అఖిలేష్ యాదవ్ కు, ఆయన కుటుంబ సభ్యులకు మరియు ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని చంద్రబాబు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =