నీట్ యూజీ-2023 ప్రవేశపరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రారంభం, 13 భాషల్లో మే 7న పరీక్ష

NEET UG 2023 Registration Begins Exam will be Conducted on May 7th,NEET UG 2023 Registration Begins,NEET UG Exam,NEET UG will be Conducted on May 7th,Mango News,Mango News Telugu,NEET UG,NEET UG 2023,NEET UG Latest News and Updates,NEET UG Updates,NEET UG Exams,NEET Under Graduate Exams,NEET Under Graduate Exam,NEET UG Application,NEET UG Apply,NEET UG Application Last Date

దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ-2023 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసి, నీట్‌ యూజీ-2023 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. అధికారిక వెబ్ సైట్ https//neet.nta.nic. in/లో మార్చి 6 నుంచి ఏప్రిల్‌ 6లోగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. నీట్ యూజీ-2023 దరఖాస్తు కోసం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,700, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్‌ జండర్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ.9,500గా నిర్ణయించారు.

ఇక నీట్ యూజీ-2023 పరీక్షను 2023, మే 7 (ఆదివారం) నాడు నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం అభ్యర్థులు నీట్ యూజీ-2023 ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. నీట్ యూజీ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ ఇలా మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − two =