కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ.. ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లో కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన 12వ నంబర్ బంగళాను ఖాళీ చేశారు. లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడటంతో ఆయన తన నివాసాన్ని ఖాళీ చేశారు. గత నెలలో గుజరాత్‌లో క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కారణంగా లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన తరువాత, లోక్‌సభ సెక్రటేరియట్ ఏప్రిల్ 22 లోగా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని కోరింది. దీంతో రాహుల్ గాంధీ, తనకు సంబంధించిన వస్తువులను 2 ట్రక్కుల్లో ఢిల్లీలోని తన తల్లి, యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ నివాసం 10 జనపథ్ నివాసానికి తరలించారు. కాగా రాహుల్‌కు పలు గృహాలు ఉన్నప్పటికీ సోనియాతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక 2005లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి మొదటి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత గాంధీకి 12 తుగ్లక్ లేన్‌లో అధికారిక బంగ్లా ఇవ్వబడింది. ఈ క్రమంలో గత నెల 23న లోక్‌సభకు అనర్హుడయ్యాడు. నిబంధనల ప్రకారం, అనర్హత పార్లమెంటేరియన్‌కు అధికారిక బంగ్లాలో ఉండే అర్హత లేదు. ఈ నేపథ్యంలో.. గడువుకు వారం ముందుగానే రాహుల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు కాగా.. సూరత్‌లోని స్థానిక న్యాయస్థానం దీనిలో ఆయనను దోషిగా నిర్ధారించడంతో పాటు రెండేళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.
ఇక ఇదిలా ఉండగా.. రాహుల్ ఇల్లు ఖాళీ చేస్తున్న నేపథ్యంలో ‘మేరా ఘర్, ఆప్కా ఘర్’ ప్రచారాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రాహుల్ గాంధీని తమ ఇళ్లకు ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూండటం విశేషం. అయితే తనకు పడిన శిక్షపై స్టే విధించాలని కోరు తూ రాహుల్ దాఖలు చేసిన అప్పీలు ప్రస్తుతం సూరత్ సెషన్స్ కోర్టులో విచారణలో ఉంది. న్యాయమూర్తి రోబెన్ మోగేరా రాహుల్ పిటిషన్‌పై తీర్పును ఏప్రిల్ 20న వెలువరిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో కోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండా రాహుల్ ముందుగానే తన ఇల్లును ఖాళీ చేయడం ప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE