యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌ జాబితాలో వరంగల్‌కు చోటు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

Union Minister Kishan Reddy Announces Warangal in Telangana State Joins The UNESCO Global Network of Learning Cities, Telangana State Joins UNESCO Global Network, Union Minister Kishan Reddy , Warangal Joins UNESCO Global Network, UNESCO Global Network of Learning Cities, UNESCO Global Network, Mango News, Mango News Telugu, UNESCO Latest News And Updates, UNESCO Warangal City, UNESCO

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరం యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌ జాబితాలో చేరిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ మహత్తర సందర్భంలో వరంగల్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయం (రుద్రేశ్వర దేవాలయం) యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఇప్పటికే చేర్చబడగా, తాజాగా వరంగల్ కు కూడా గుర్తింపు రావడంతో ఏడాది కాలంలోనే తెలంగాణకు యునెస్కో ద్వారా రెండో గుర్తింపు లభించిందన్నారు. భారతదేశం యొక్క సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడానికి మరియు ప్రదర్శించడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

వరంగల్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ, పారిశ్రామిక మరియు సేవా రంగాలతో కూడి ఉందని, అలాగే నగరం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందని యునెస్కో పేర్కొంది. ప్రతి సంవత్సరం 3.2 మిలియన్ల మంది పర్యాటకులను వరంగల్ స్వాగతిస్తుందని ఇది భారతదేశంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =