తెలంగాణ వ్యాప్తంగా కిడ్నీ బాధితుల కోసం 100కి పైగా డయాలసిస్ కేంద్రాల్లో సేవలు అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 102 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇవి కిడ్నీ బాధితులకు వరంలా మారాయని పేర్కొన్నారు. ఒకప్పుడు కిడ్నీ బాధితులు డయాలసిస్ సేవల కోసం ఎన్నో వ్యయ,ప్రయాసలకోర్చి హైదరాబాద్ వరకూ రావాల్సిన అవసరం ఉండేదని, అయితే ఇప్పుడు ఎక్కడికక్కడ వారికి అందుబాటులోనే కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
ఒకప్పుడు కేవలం గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వైద్యశాలల్లోనే ఈ సదుపాయం ఉండేదని, అయితే రాష్ట్రం ఏర్పడ్డాక సిర్పూర్ కాగజ్నగర్, ఏటూరునాగారం వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం నేడు డయాలసిస్ సేవలను అందిస్తున్నామని మంత్రి వివరించారు. ఇక కిడ్నీ బాధితులకు ఇన్ఫెక్షన్లు సోకకుండా దేశంలోనే తొలిసారిగా సింగిల్ యూజ్ డయలైజర్ పద్ధతిని అనుసరిస్తున్నామని, అలాగే పేషెంట్లకు ఆసరా పింఛన్, డయాలసిస్ కేంద్రానికి చెరుకునేందుకు వీలుగా ఉచిత బస్పాస్ సౌకర్యం వంటివి ప్రభుత్వం తరపున కల్పిస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE