ఇది అన్నదాత చారిత్రిక విజయం : హోం మంత్రి మహమూద్ అలీ

3 Farm Laws, Agricultural Laws are Repealed in Parliament, constitutional measures to repeal farm laws, Govt to repeal three contentious farm laws, Home Minister, Home Minister Mahmood Ali, Home Minister Mahmood Ali Says Withdrawal of Agriculture Acts was Farmers Historical Win, Mahmood Ali, Mango News, Parliament, Three Farm Laws, Withdrawal of Agricultural Acts, Withdrawal of Agriculture Acts, Withdrawal of Agriculture Acts was Farmers Historical Win

రైతులు వ్యతిరేకిస్తున్న మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం అన్నదాత విజయమని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. వందల మంది రైతులు కొన్ని నెలలుగా మొక్కవోని దృడ సంకల్పంతో చలికి వణుకుతూ, ఎండకు ఎండుతు, వానకు తడుస్తూ, ఆకలికి అలమటిస్తూ కేసులకు జంకకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన పోరాటానికి ఫలితమని హోం మంత్రి పేర్కన్నారు. ఈ ఉద్యమం నేపథ్యంలో ఎంతోమంది రైతులు ప్రాణాలను సైతం త్యాగం చేసారనీ, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ, అసువులు బాసిన రైతులకు నివాళులర్పించారు. అమరులైన రైతుల కుటుంబాలను ఆదుకునే భాద్యత కేంద్రం తీసుకోవాలనీ, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకు వచ్చిన వెంటనే, కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు, రైతులకు అండగా నిలిచి పోరాటం చేస్తోందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృడ సంకల్పం, పట్టుదల, మొక్కవోని దీక్ష, దక్షత ఏంటో, తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ఏంటో దేశం మొత్తానికి తెలుసున్నారు. కేసీఆర్ నాయకత్వంలో రైతులకు అండగా, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటానికి నాంది పలకడం కూడా అందరికీ తెలిసిందేనని వివరించారు. కేసీఆర్ నాయకత్వంలో గురువారం నాడు మహాధర్నా కూడా చేసామని, ఈ సందర్భంగా కేసీఆర్ రైతులకు అండగా ఉంటామని, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతామని తన ప్రసంగంలో పేర్కొన్న విషయం గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వం రైతులకు దొరుకుతుందని భయమే ఈ ప్రకటన అని అభిప్రాయ పడ్డారు. దేశంలోని ప్రభావశీల ముఖ్యమంత్రులలో కేసీఆర్ ఒకరని, ఆయన స్వరం కూడ ఉద్యమాన్నిప్రభావితం చేస్తుందని హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదని, 2014 నుంచి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు పూర్తి సహకారం అందించి అనేక రైతు సంక్షేమ, రైతు ప్రగతి పథకాలు అమలు చేస్తోందన్నారు. రైతు బీమా, రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు వంటి పధకాలు దేశం మొత్తం దృష్టిని ఆకర్షించాయని, తెలంగాణ రైతాంగానికి ఎంతో మేలు చేసాయని, తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 11 =