సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో.. ఈ నెల 19, 20 తేదీల్లో నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ తొలి శిక్షణ శిబిరం

CM KCR To Hold BRS Training Camp For Party Leaders and Workers on May 19-20 in Nanded Maharashtra,CM KCR To Hold BRS Training Camp,BRS Training Camp For Party Leaders,BRS Training Camp For Workers,BRS Training Camp On May 19-20,Mango News,Mango News Telugu,BRS Training Camp In Nanded Maharashtra,BRS Training Camp in Nanded-Namasthe Telangana,BRS Training Camp,BRS Training Camp Latest News And Updates,CM KCR Latest News And Updates,Maharashtra Latest News And Updates

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో ముందుగా పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఇతర పార్టీల నుంచి నాయకులను ఆహ్వానిస్తున్నారు. అలాగే పెద్దఎత్తున రైతు సంఘాల నేతలను బీఆర్‌ఎస్‌ లోకి చేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పార్టీలో చేరినవారికి పార్టీ విధి విధానాలపై అక్కడి నేతలకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు రెండు రోజుల శిక్షణ శిబిరం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ తొలి శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.

కాగా నాందేడ్‌లోనిర్వహించనున్న ఈ తరగతులకు 1,000 మంది కార్యకర్తలకు అవకాశం కల్పించనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు కార్యకర్తలను ఆహ్వానిస్తున్నామని, వీరందరికీ శిక్షణ శిబిరం జరిగే రెండు రోజులపాటు నాందేడ్‌లోనే వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఇక రెండు రోజుల శిక్షణ సందర్భంగా.. మహారాష్ట్రలో పార్టీ అనుబంధ సంఘాలను కూడా నియమించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు, ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా దృష్టిపెట్టనున్నట్లు సమాచారం. ఎక్కడికక్కడ రైతులతో ర్యాలీలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా ర్యాలీ లేదా భారీ బహిరంగ సభను నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − one =