సుమారు 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరింది. యావత్ ప్రపంచం భారత దేశం వైపు చూసే రోజు వచ్చింది. ఈనెల 22న అత్యంత అట్టహాసంగా ప్రారంభమయిన అయోధ్య రామమందిరంలో బాలరాముని దర్శన బాగ్యం కలిగింది. అయితే ఆ రోజు కేవలం ప్రముఖులు మాత్రమే రామయ్యను దర్శించుకోగా.. జనవరి 23 నుంచి సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇలా భక్తుల రాకతో ఉత్తరప్రదేశ్ ఆర్థికంగా రూ. వేలకోట్లు ఆర్జిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలు చెబుతున్నాయి.
రామ మందిర నిర్మాణం కావడంతో.. ఇకపై అయోధ్య భారతదేశంలో సందర్శించదగ్గ ఒక ఆధ్యాత్మిక , పర్యాటక ప్రదేశంగా అందరినీ ఆకట్టుకోబోతోన్నట్లు అంతా అనుకుంటున్నారు. ఎక్కువ మంది పర్యాటకులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉండటంతో.. ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు
2024-25 ఉత్తరప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ రూ.20 వేల నుంచి రూ. 25వేల కోట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం యూపీ రాష్ట్ర పర్యాటకరంగం ఆదాయం రెట్టింపు అవుతుందని అంటున్నారు. ఇప్పటికే అయోధ్యలో హోటల్స్, రెస్టారెంట్స్, ఇతర వ్యాపారాలు భారీగా సాగుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
2022నుంచి 2023 వరకూ ఉత్తరప్రదేశ్ సందర్శించిన పర్యాటకులు 32 కోట్లు ఉండగా వీరిలో 2.21 కోట్లమంది జనాభా అయోధ్యకు వచ్చారు. ఇలా పర్యాటకులు ద్వారా యూపీకి వచ్చిన ఆదాయం రూ. 2 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటికే పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉన్న ఉత్తరప్రదేశ్.. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో మరింత ఆదాయం పొందనుందని నిపుణులు చెబుతున్నారు.
2027 నాటికి యూపీ ఆర్ధిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లు దాటుతుందని చెబుతున్న నిపుణులు..ఇది దేశ జీడీపీలో 10శాతం అని అంటున్నారు. జీడీపీ వెయిటేజ్లో 2027-28 నాటికి ఉత్తరప్రదేశ్ 2వ స్థానాన్ని పొందుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో నార్వే జీడీపీని ఉత్తరప్రదేశ్ కచ్చితంగా అధిగమించే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE