ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారు, ఎప్పుడంటే?

PM Modi to Visit Telangana on February 13th will Address Public Meeting at Parade Grounds,PM Modi to Visit Telangana,Modi Visit Telanganaon February 13th,Address Public Meeting at Parade Grounds,Mango News,Mango News Telugu,Telangana Govt,Telangana Govt Latest News and Updates,Telangana Govt News and Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 13, సోమవారం ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు, రహదారుల విస్తరణ పనులు సహా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటుగా మరికొన్ని అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసే బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ముందుగా ఈనెల 19న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైల్ ను ప్రారంభించడంతో పాటుగా రూ.7 వేల కోట్లకుపైగా విలువగల పలు ప్రాజెక్టులకు భూమిపూజ, మరికొన్నింటిని జాతికి అంకితం చేయాల్సి ఉంది. అయితే వివిధ షెడ్యూల్స్ లో మార్పుల కారణంగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే జ‌న‌వ‌రి 15, ఆదివారం ఉద‌యం 10:30 గంట‌ల‌కు సికింద్రాబాద్‌-విశాఖ‌పట్నం మధ్య నడిచే ‘వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు’ ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటించి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 8 =