ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, ఫైల్స్ షేర్ ఆప్షన్

Photos, Files, Internet, Photos, Files Share Option without Internet, WhatsApp New Feature, Photos, Files Share Option, without Internet, Internet Service, Photos without WiFi, Latest Technologies, Latest Internet Updates, Mobile Updates, Updates Features, Mango News Telugu, Mango News
WhatsApp new feature, Photos, files share option, without internet,

స్మార్ట్‌ఫోన్‌లో ఏ యాప్ వాడాలన్నా కూడా కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఫైల్స్ డౌన్‌లోడ్ చేయలేం..మెసెంజెర్ యాప్స్‌లో మెసేజెస్ కూడా చూడలేం. అయితే ఈ పరిస్థితికి చెక్ పెట్టే ప్లాన్ వస్తోంది. ఇంటర్నెట్‌తో పని లేకుండానే వాట్సాప్‌లో ఫైల్స్ షేర్ చేసుకునే ఫీచర్‌ను తీసుకొస్తోంది. ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా ఉండే యాప్స్‌లో వాట్సాప్ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్‌కే గుర్తింపు ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకురావడమే దీనికి కారణం. యూజర్ల అవసరాలకు అనుగుణంగా తీసుకొస్తున్న ఫీచర్లే వాట్సాప్‌ను అగ్రస్థానంలో నిలిపింది.  తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఫొటోలు, వీడియోలు షేరింగ్‌లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.

ఇప్పటికే వాట్సాప్‌ హెచ్‌డీ క్వాలిటీతో ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్‌ చేసుకోవడానికి వీలుగా గతేడాది 2 జీబీ ఫైల్‌ షేరింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫోటోలు, వీడియోలు పంపించుకోవచ్చనే గుడ్ న్యూస్ చెబుతోంది. ఈ ఫీచర్‌ అచ్చంగా ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ నియర్‌బై షేర్‌, ఐఓఎస్‌ ఎయిర్‌ డ్రాప్‌ తరహాలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉంది. పూర్తికాగానే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

బ్లూటూత్ సహాయంతో ఈ ఫీచర్‌ పని చేస్తుంది. దీని ద్వారా పెద్ద ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఒకేసారి 2GB డేటా ఫైల్స్‌ షేర్ చేసుకోవచ్చు. అయితే ఇందులో అవతలి వ్యక్తి మీకు యాక్సెస్ ఇస్తేనే ఈ విధమైన షేరింగ్ ఆప్షన్ సాధ్యమవుతుంది. ఇలా కేబుల్స్, నెట్ వర్క్ అవసరం లేకుండా ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ కనెక్టివిటీతో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు.

తమ యూజర్ల ప్రైవసీకి ఇబ్బంది రాకుండా దీనికి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సెక్యూరిటీ కూడా ఉంటుందని వాట్సాప్‌ తెలిపింది. ఇదిలా ఉంటే ఫొటో, వీడియోలు, ఆడియోలను పక్కన ఉన్న వారికి అత్యంత వేగంగా షేర్‌ చేసుకునేందుకుగాను గతంలో షేర్‌ ఇట్‌ యాప్‌ అందుబాటులో ఉండగా.. ఈ యాప్‌పై కేంద్రం నిషేధం విధించింది. దీంతోనే గూగుల్‌ యూజర్ల కోసం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో నియర్‌బై షేర్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది.తాజాగా వాట్సాప్‌ నియర్‌బైకి పోటీగా ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE