మందు బాటిల్‌ను ఓపెన్ చేసి ఎన్ని రోజులు ఉంచుతున్నారు?

alcohol, keep the alcohol bottle after opening it,alcohol bottle ,Wine, beer, whiskey, rum, gin, Opened liquor, opened bottle, beer bottle, Life of Alcohol, expiery date, Mango News Telugu, Mango News
alcohol, keep the alcohol bottle after opening it,alcohol bottle ,Wine, beer, whiskey, rum, gin,

ఒకప్పుడు ఆల్కహాల్ పేరు చెప్పగానే చాలా మంది  దూరంలో ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలతో పోటీ పడుతూ మరీ మందు తాగేస్తున్నారు. బర్త్ డే పార్టీ నుంచి పెళ్లి వరకూ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా మందు లేనిదే ఆ వేడుక పూర్తి కాదు అన్నట్లుగా ఫీలవుతున్నారు. మద్యం మంచిది కాదని ఎంతగా చెబుతున్నా టీనేజీ పిల్లలు కూడా మందు తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే కొంతమంది  మాత్రం మళ్లీ మళ్లీ బయటకు వెళ్లలేక ఒకేసారి పెద్ద బాటిల్‌ను ఇంటికి తెచ్చుకొని అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు. అయితే అలా ఓపెన్ చేసిన బాటిల్ ను ఎన్ని రోజుల వరకు తాగొచ్చు అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. కానీ ఓపెన్ చేయకుండా ఎన్ని రోజులు ఉంచినా పర్వాలేదు కానీ ఒకసారి బాటిల్ మూత ఓపెన్ చేశాక ఎక్కువ రోజులు ఉంచకూడదని నిపుణులు చెబుుతున్నారు.

ఎందుకంటే అలా ఓపెన్ చేసిన బాటిల్‌కు ఒక ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంటుందట. ఒక్కసారి ఓపెన్ చేసిన ‌బాటిల్‌ను ఎన్ని రోజుల వరకు తాగొచ్చనే విషయాన్ని నిపుణులు వివరించారు. కొంతమంది మందును కొంచెం కొంచెం తాగుతూ ఉంటారు. ఇలాంటివారంతా పెద్ద బాటిల్ ఒకటి తెచ్చుకొని, రోజుకు ఒక చిన్న పెగ్గు చొప్పున కొన్ని రోజులపాటు తాగుతూ ఉంటారు. కానీ అలా తాగకూడదట. ఆల్కహాల్ బాటిల్ ఓపెన్ చేయగానే ఆల్కహాల్‌లో ఉండే ఎసిటిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

అందుకే మద్యం  బాటిల్‌ను ఓపెన్ చేసిన తర్వాత.. వారం రోజులలోపు దానిని  తాగేయాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా యూత్ ఎక్కువగా ఇష్టపడే బీర్‌కు కూడా ఎక్స్పైరీ డేట్ కంటే ముందే ముగుస్తుందని అంటున్నారు. సాధారణంగా బీర్ బాటిల్ గడువు కాలం ఆరు నెలలు ఉంటుంది కానీ..దీన్ని ఓపెన్ చేసిన  తర్వాత మాత్రం ఒక రోజులో మాత్రమే తాగాలట. అలా కాకుండా బాటిల్ ఓపెన్ చేసిన కొన్ని రోజుల పాటు అలాగే ఉంచితే.. అది ఆక్సిజన్‌తో చర్యలు జరిపి వాసనతో పాటూ రుచి కూడా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY