సీటు కోసం భూమా ఫ్యామిలీలో పోరు

Bhuma family, Bhuma Akhila priya, Bhuma keshav reddy, Allagadda, TDP, MLA ticket, political war against Akhila Priya, Political Updates, AP Political Updates, Andhra Pradesh, Andhra Pradesh Latest Updates, Andhra Pradesh News, Andhra Pradesh Politics, Mango News Telugu, Mango News
Bhuma family, Bhuma Akhila priya, Bhuma keshav reddy, Allagadda, TDP

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ఆళ్లగడ్డలో  రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా భూమా కుటుంబంలో సీటు కోసం పోరు కొనసాగుతోంది. నిజానికి ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీదే ఆధిపత్యం. ఆ కుటుంబం నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. టీడీపీ హయాంలో భూమా అఖిల ప్రియ మంత్రివర్గంలో కూడా చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆళ్లగడ్డ నుంచి బరిలోకి దిగేందుకు అఖిల ప్రియ సిద్ధమవుతుండగా.. సొంతింటి నుంచే ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

భూమా ఫ్యామిలీ నుంచి 2014 లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అఖిల ప్రియ. అదే ఏడాది జరిగిన ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో చోటు కూడా దక్కించుకున్నారు. పర్యాటక, తెలుగు భాష, సంస్కృతి శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ తరుపున ఆళ్లగడ్డ నుంచి అఖిల ప్రియ పోటీ చేశారు. కానీ ఈసారి అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఈక్రమంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా బరిలోకి దిగేందుకు అఖిల ప్రియ సిద్ధమవుతున్నారు.

అయితే అఖిలప్రియ పోటీకి సిద్ధమవుతుంటే.. తన సొంతింటి వారే ఆమెను వ్యతిరేకిస్తున్నారు. సొంతింటి పోరు అఖిల ప్రియకు తలనొప్పిగా మారింది. ఆళ్లగడ్డ బీజేపీ ఇంఛార్జి‌గావున్న కిశోర్ రెడ్డి, అఖిల ప్రియ మేనత్త శ్రీదేవిలు అఖిల ప్రియ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు అఖిల ప్రియకు భూమా కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని తేల్చేశారు శ్రీదేవి. తన భర్త మద్దూరు భార్గవరామ్ కుటుంబానికి చెందిన వారని వ్యాఖ్యానించారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో అఖిల ప్రియకు ఎట్టిపరిస్థితిలోనూ మద్ధతు ఇచ్చేది లేదని  శ్రీదేవి తేల్చేశారు. భూమా కుటుంబమంతా కిషోర్ రెడ్డికే మద్ధతు ఇస్తుందని చెప్పుకొచ్చారు. ఆళ్లగడ్డ నుంచి భూమా కుటుంబం తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసేది భూమా కిశోర్ రెడ్డి మాత్రమేనని అన్నారు. ప్రజలంతా భారీ మెజార్టీతో కిషోర్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. మరోవైపు అఖిల ప్రియ అధికారంలోవున్నప్పుడు ఎన్నో ఘోరాలు చేశారని.. అవన్నీ ప్రజలకు తెలుసునని కిషోర్ రెడ్డి వెల్లడించారు. ఎన్నో ఘోరాలు చేసి తమ ఫ్యామిలీకి చెడ్డ పేరు తీసుకొచ్చింది కాబట్టి.. అఖిల ప్రియను భూమా ఫ్యామిలీ పక్కకు పెట్టిందని కిషోర్ రెడ్డి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fourteen =