తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలపై కాంగ్రెస్ కన్ను

Congress, Rajya Sabha seats, Telangana, 3 Rajya Sabha seats in Telangana, BRS, Rajya Sabha seats in Telangana,Election schedule, election notification,Last Date for Nomination, Election Commission, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, Mango Telugu News, Mango News
BRS, Congress, Rajya Sabha seats in Telangana,Election schedule, election notification,Last Date for Nomination, Election Commission

తెలంగాణకు సంబంధించి ఏప్రిల్‌లో ఖాళీ అవనున్న 3 స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది.  ఫిబ్రవరి 8న దీనిపై ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్‌కు చివరి తేదీగా ఫిబ్రవరి 15 వ తేదీ.. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16 వ తేది, నామినేషన్ల విత్ డ్రాకు ఫిబ్రవరి 20, ఎన్నికల నిర్వహణ కోసం ఫిబ్రవరి 27వ తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ మూడు సీట్లనూ కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు.  ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల నిబంధనలనే తమకు అనుకూలంగా  మార్చుకుని వాడుకోవాలనే ప్లాన్‌లో కాంగ్రెస్ నేతలు ఉన్నారట.

నిజానికి రాజ్యసభ ఎన్నికల కోసం ఒక ప్రాసెస్ ఉంటుంది. దీని ప్రకారం ఖాళీ అవుతున్న మూడు సీట్లకు అదనంగా  మరొకటి  కలుపుకోవాల్సి ఉంటుంది. అంటే మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లుగా లెక్కవేసుకుని.. అసెంబ్లీ సీట్లను డివైడ్ చేస్తారు. అంటే మొత్తం 119 అసెంబ్లీ సీట్లను డివైడెడ్ బై నాలుగు అని  లెక్కబెట్టాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఒక్కొక్క రాజ్యసభ సీటు గెలవడానికి సుమారు 30 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారన్నమాట. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బలాలవల్ల  కాంగ్రెస్ సులువుగా రెండు స్థానాలు, బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుంది.

అసెంబ్లీలో ఉన్న బలాల ప్రకారం.. కాంగ్రెస్ రెండు రాజ్యసభ సీట్లు గెలుచుకునే అవకాశముండగా, మిత్రపక్షంతో కలుపుకొంటే మరో 5 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అదనంగా వస్తాయి. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల లాగే బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటే.. మొత్తం సంఖ్యా బలం 119 స్థానాల నుంచి  111 స్థానాలకు పడిపోతుందన్న మాట.  ఇక ఏంఐఏం కూడా దూరంగా ఉంటే ఆ సంఖ్యా బలం ఏకంగా 104కు పడిపోతుంది. అప్పుడు నిబంధన ప్రకారం 104 స్థానాలను నాలుగు భాగాలుగా విభజించాలి.

అప్పుడు ఒక్కో రాజ్యసభ సీటు బలం 26కు తగ్గిపోతుంది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేసే చాన్స్ ఉండదు. ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయొచ్చు. ఇదే అదునుగా తీసుకొని ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాడానికి కాంగ్రెస్ స్కెచ్ వేస్తోంది. బీఆర్ఎస్ నుంచి 13 మందిని తమకు అనుకూలంగా మార్చుకుని ఓటు వేయిస్తే సెకండ్ ప్రియారిటీ ఓట్లతో మూడో సీటును కాంగ్రెస్ ఈజీగా కైవసం చేసుకోవచ్చు. ఒకవేళ 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కి సహకరిస్తే మాత్రం  మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కాంగ్రెస్ మూడు రాజ్యసభ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంటుంది.

పదుల సంఖ్యలో బీఆర్ఎస్ లీడర్స్ తమతో టచ్‌లో ఉన్నారని కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్పడం, దానికి ఊతమిచ్చినట్లుగానే కొంతమంది ఎమ్మేల్యేలు సీఏం రేవంత్‌ని కలవడం లాంటివి చూస్తుంటే కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తే తమకి కావాల్సిన ఓట్లను సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా  అంచనా వేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ మూడో రాజ్యసభ సీటుపై కూడా కన్నేయడంతో బీఆర్ఎస్ అధిష్టానానికి పరేశాన్ తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 4 =