దేశమంతా లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే.. తెలంగాణలో ఎన్నికల వేడి మరింత భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికలు అలా ముగిశాయో లేదో.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలయింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ చేసి.. మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ఈసారి మరింత ఫోకస్ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈక్రమంలో లోక్ సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ఇక్కడే బీజేపీకి పెద్ద సమస్యొచ్చి పడింది. అసలు బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారట. బీజేపీ తరుపున పోటీ చేసేందుకు అసలు గట్టి అభ్యర్ధులే లేరట. అటు తెలంగాణ బీజేపీ నేతలు మెజార్టీ స్థానాలు దక్కించుకుంటామని అంటున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలంగాణలోని 17కు 17 స్థానాల్లో గెలుపొంది తీరుతామని ప్రకటించారు. కానీ నేతలు చెప్పేదానికి.. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితికి ఏమాత్రం సంబంధం లేదట. రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 12 స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీకి సరైన అభ్యర్థులే లేరట.
నల్గొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి, మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, చేవెళ్ళ, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో పోటీ చేసేందుకు బీజేపీకి గట్టి అభ్యర్థులే లేరని ఓ సర్వేలో తేలిందట. ఇటీవల బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. పెద్ద ఎత్తున నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. కానీ అందులో బలమైన నేతలు ఎవరూ లేరట. వారిని బరిలోకి దించినా ఓటమి ఖాయమనే విషయం బీజేపీ పెద్దలకు అర్థమయిందట. ఈక్రమంలో ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను తమవైపు తిప్పుకోవాలని టి. బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలయింది. ఈక్రమంలో ఆ పార్టీలోని మాజీ మంత్రులకు బీజేపీ గాలమేస్తోందట. బలమైన నేతలను తమవైపు తిప్పుకోవాలని ప్రయాత్నలు చేస్తోందట. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీలతో బీజేపీ నేతలు చర్చలు జరిపారట. తమవైపు తిప్పుకునేందుకు పలు ఆఫర్లు గుప్పించారట. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం బీజేపీలో చేరేందుకు ఏమాత్రం సానుకూలంగా లేరట. మరి ఇతర పార్టీల నుంచి ఎవరూ రాకపోతే బీజేపీ పరిస్థితి ఏంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE