సొంతపార్టీలో రాజీనామాల షాక్

Nagari Constituency Did Not Leave Minister Roja, Nagari Constituency, Nagari Constituency Resignations, Headache to Roja, Nagari Panchayat, Minister Roja, Resignations In Own Party, Voting, TDP, Jana Sena, Pawan Kalyan, CM Jagan, Assembly Elections, Lok Sabha Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Nagari Panchayat, Minister Roja, resignations in own party,voting,TDP, Jana Sena, Pawan Kalyan, CM Jagan,

ఏపీలోలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజా పోటీ చేస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో మరో కొత్త పంచాయితీ తెర మీదకు వచ్చింది.  ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి మరీ తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నేతలకు సస్పెన్షన్ వేటు వేసి దారికి తెచ్చుకోవాలనుకున్న రోజాకు ఊహించని రీతిలో సొంత పార్టీ నేతలు మరో షాకిచ్చారు. ఇలా అనుకోని రీతిలో రివర్స్‌ షాక్‌ తగులడంతో రోజాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

వైసీపీలో ఫైర్‌ బ్రాండ్‌‌గా పేరు  మంత్రి రోజాకు మొదటి నుంచీ కూడా   తన సొంత నియోజకవర్గం నగరిలో సొంత పార్టీ నుంచే  సమస్యలు ఉన్నాయి. రెండు సార్లు నగరి నుంచి విజయం సాధించిన రోజాకు స్థానిక వైసీపీ నేతలతో విభేదాలు తలనొప్పిగా తయారయ్యాయి. ఏ నియోజకవర్గంలోనూ లేనంతగా నగరి వైసీపీలో గ్రూపు రాజకీయాలు  పెరిగిపోయాయన్న వార్తలు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి.

రెండు సార్లు రోజాను గెలిపించనవారే..తర్వాత రోజా  తీరు నచ్చకపోవడంతో తిరుగుబాటు చేస్తూ వస్తున్నారు. చివరకు టికెట్ ఇచ్చేముందు కూడా ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఆమెకే టికెట్ ఇవ్వడాన్ని జీర్జించుకోలేకపోయారు. దీంతో అవకాశమున్న ప్రతీ చోట రోజాకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో..  ఈ రచ్చకు పులిస్టాప్‌ పెట్టడానికి వడమాలపేట జెడ్పీటీసీ మురళీరెడ్డిని శుక్రవారం వైసీపీ నుంచి సస్పెండ్‌ చేశారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు అయిన మురళీరెడ్డిని సస్పెండ్ చేయడంతో..జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. మురళీరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం జీర్ణించుకోలేని రోజా వ్యతిరేక వర్గం.. నగరి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాలకు చెందిన కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించి  ఇటు రోజాకు, అటు వైసీపీకి ఝలక్ ఇచ్చారు. నిన్నటి  వరకు రోజాకు సపోర్ట్‌గా ఉన్న నేతలంతా ఇప్పుడు ఇలా షాకివ్వడంతో.. ఎన్నికల ముందు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందోనన్న చర్చ మొదలైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY