ప్రశంసలు, పురస్కారాలు కడుపు నింపలేదని ఆవేదన

A daily wage laborer, Mogilaiah, awards,Kcr Government, Darsanam Mogilaiah, PaWan Kalyan, Bheemal Naik Movie
A daily wage laborer, Mogilaiah, awards,Kcr Government, Darsanam Mogilaiah, PaWan Kalyan, Bheemal Naik Movie

మొగిలయ్య..మట్టిలో మాణిక్యం అంటూ గతేడాది మారుమ్రోగిపోయింది.   అతని గాన ప్రతిభకు గుర్తింపుగా ప్రశంసలు, పురస్కారాలు కూడా వచ్చాయి. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే పద్మశ్రీ అవార్డును కూడా మొగిలయ్యకు ఇచ్చి ఆయనను సత్కరించింది. దీంతో అతని కష్టాలు మాయమైపోయినట్టేనని అనుకున్నారు. కానీ ఆ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ కనీసం తన పొట్ట కూడా నింపలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో పూట గడవడం కోసం రోజువారీ కూలీగా మారాల్చి వచ్చింది.

దర్శనం మొగిలయ్య రెండే ళ్ల క్రితం వరకూ..పొట్ట కూటి కోసం పాటలు పాడుకుంటూ ఊరూరా తిరిగారు.కిన్నెర వాయిద్యంతో వాయిస్తూ తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను కలిగి ఉంటూ.. సంగీత ప్రియులను అలరించారు. తన పాటలను మెచ్చిన సినీ పరిశ్రమ కూడా మొగిలయ్యకు అవకాశం మిచ్చింది.  పవన్ కళ్యాణ్ తన  ‘భీమ్లా నాయక్’ సినిమాలో మొగిలయ్యకు అవకాశం ఇచ్చారు. దీని తర్వాత ఆయన ప్రతిభ గురించి మరింతగా అందరికీ తెలిసింది.

మొగిలయ్య ప్రతిభకు గుర్తింపుగా ప్రశంసలు, పద్మశ్రీ వంటి పురస్కారాలు కూడా వచ్చాయి. కానీ  అవేమీ ఇప్పుడు  కనీసం మొగిలయ్య పొట్ట కూడా నింపలేదు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పూట గడవడం కోసం రోజువారీ కూలీగా మారాల్చి వచ్చింది. దర్శనం మొగులయ్య తాజాగా హైదరాబాద్‌ సమీపంలోని తుర్కయమంజాల్‌లోని ఓ నిర్మాణ స్థలంలో కూలి పని చేస్తూ కనిపించడంతో కొంతమంది తమ కెమెరాలకు పని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గతంలో కేసీఆర్ ప్రభుత్వం మొగిలయ్యకు  కోటి రూపాయలు అందించింది. కాకపోతే అవి మొగిలయ్య పిల్లల పెళ్లిళ్లతో పాటు స్థలం కొనుక్కోవడానికి సరిపోయాయని మొగిలయ్య చెబుతున్నారు. ఆ  డబ్బులు సరిపోకపోవడంతో కడుతున్న ఇంటిని కూడా మధ్యలోనే ఆగిపోయిందట. దీనికితోడు మొగిలయ్య కుమారులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో..ముందుల కోసమే నెలకు రూ. ఏడు వేలు వరకూ ఖర్చు అవుతోంది.

మరోవైపు మొగిలయ్యకు నెలా నెలా రావాల్సిన పెన్షన్.. 2,3 నెలలుగా రావడం లేదు. దీంతో ఇంట్లో పూట గడవటం కష్టంగా ఉండటంతో..పని కోసం చాలా చోట్లు ప్రయత్నించానని మొగిలయ్య  చెబుతున్నారు.  చాలామంది తనపై సానుభూతి చూపిస్తున్నారు తప్ప పని ఇవ్వడం లేదని. అందుకే ఇక ఇలా కూలీగా మారానంటూ  మొగిలయ్య  అంటున్నారు. అయితే కోటి రూపాయలు వచ్చినప్పుడు దానిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం రాక మొగిలయ్య  ఇప్పుడు కూలీగా మారారని..లేదంటే ఇలాంటి పరిస్థితి రానేరాదని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =