కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

AP People Are Going To Vote, Going To Vote, AP People Vote, AP Elections 2024, Telangana, Andhra Pradesh, Hyderabad, Gannavaram Airport, People of AP Going to Vote, Kilometers of Parked Vehicles, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu
AP Elections 2024, Telangana, Andhrapradesh,Hyderabad,Gannavaram Airport,People of AP going to vote Kilometers of parked vehicles,

హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే నేషనల్ హైవే సంక్రాంతి పండుగ రోజులను తలపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో..వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓటు వేయడానికి ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వెళుతున్న  ప్రయాణికుల వాహనాలతో నేషనల్ హైవే  కిక్కిరిసి పోయింది.మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు  పోలింగ్  జరగనుండటంతో హైదరాబాద్ , తెలంగాణలోని ప్రజలు.. ఆంధ్రప్రదేశ్‌కు  తరలివెళ్తున్నారు. దీంతో సంక్రాంతిని తలపించే విధంగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం 6 గంటల నుంచి వెహికల్స్ సందడి కనిపిస్తుండగా.. ఇప్పటికీ వాహనాల రాక ఇంకా కొనసాగుతోంది.

వాహనాల రద్దీ  పెరిగిపోవడంతో గట్టు భీమవరం, కీసర టోల్ ప్లాజాల వద్ద టోల్ ప్లాజా సిబ్బంది అదనపు గేట్లను కూడా తెరిచారు. హైదరాబాద్ నుంచి వెళుతున్న వెహికల్స్‌తో  ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానిపురంలో ఇప్పటికే  భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. స్వంత వాహనాలతో వెళుతున్న వారితో పాటు.. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీలోని  ఆయా నియోజకవర్గాలకు చెందిన వారంతా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసుకుని మరీ స్వగ్రామాలకు పయనమవడంతో ఎక్కడ చూసినా వాహనాల సందడే కనిపిస్తోంది

మరోవైపు  బెజవాడ  పండిట్ నెహ్రూ బస్ స్టాండ్  కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి బస్సుల్లో వస్తున్న ఏపీ వాసులు.. బెజవాడ బస్ స్టాండ్‌లో బస్సులు మారి స్వగ్రామాలకు పయనమవుతున్నారు. అంతేకాకుండా  విదేశాల నుంచి కూడా ప్రత్యేకించి ఓటు వేయడానికి ఏపీవాసులు భారీగా తరలిరావడం విశేషం.

శుక్రవారం రాత్రి ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు ఫుల్ ఆక్యుపెన్సీతో ఉండటమే దీనికి నిదర్శనం.  ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్స్‌లో అమెరికా నుంచి ఏపీవాసులు వచ్చారు. అలాగే ఆస్ట్రేలియాలో షార్జా నుంచి కూడా శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి  రెండు ప్రత్యేక విమానాలు వచ్చాయి. గుంటూరు కృష్ణా జిల్లాల చెందిన 250 మంది ఆంధ్రావాసులు.. షార్జా నుంచి ఏపీకి చేరుకున్నారు.మొత్తంగా అన్ని పార్టీలు గెలుపును ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవడంతో పాటు.. ఈసారి ఎలా అయినా ఓటు వేయాలన్న కోరికతో ఏపీ ఓటర్లు పెద్ద ఎత్తున తరలివెళుతుండంతో ఎన్నికల ఫలితాలపై అందరికీ ఇప్పటినుంచే ఆసక్తి పెరిగిపోతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY